
మంగళగిరి:02-11-25:-దివంగత నేత, మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు వర్ధంతి వేడుకలను ఆదివారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్‌లో నాయకులు, కార్యకర్తలు ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఆదర్శాలను అనుసరించి పార్టీ ఆవిర్భావం నుంచే టీడీపీకి మూలస్తంభంగా సేవలందించిన మహానాయకుడు సిక్కోలు సింహం ఎర్రన్నాయుడు అని పేర్కొన్నారు. ప్రజా సేవలో తిరుగులేని నిబద్ధత, నిజాయితీ, ఆత్మీయత కలబోసిన నాయకుడిగా ఆయన గుర్తు చేసుకున్నారు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో మచ్చలేని చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎర్రన్నాయుడు అని అన్నారు.కార్యక్రమంలో మంగళగిరి పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, గోశాల రాఘవ, వడిశా నరేష్, నేరెళ్ల బాలాజీ, రుద్రు శ్రీను, ఎండీ ఆరిఫ్, ఎండీ షరిఫీ తదితర నాయకులు పాల్గొన్నారు.







