chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Mangalagiri Local News :తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలం- ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

Mangalagiri Local News :తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలం- ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

Mangalagiri Local News :తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలం- ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

పార్టీ బలోపేతం కావాలంటే జిల్లా స్థాయి నుంచే పటిష్టమైన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పార్టీకి సైన్యాధిపతుల్లా వ్యవహరించాలని, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని సూచించారు. ప్రజల మధ్యే ఉంటూ, ప్రజల సమస్యలే అజెండాగా ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Mangalagiri Local News :తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలం- ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని తెలిపారు. గత ఐదేళ్ల అస్తవ్యస్త పాలన కారణంగా మౌలిక సదుపాయాల కొరత ఏర్పడిందని, సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆ సమస్యలను క్రమంగా పరిష్కరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు నాయుడే రాష్ట్రానికి అవసరమని అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ స్పష్టమైన దృష్టితో పాలన సాగిస్తున్నారని ప్రశంసించారు.
మంత్రి నారా లోకేష్ పనితీరుకు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందని, యువ నాయకుడిగా ఆధునిక ఆలోచనలతో బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని అన్నారు.

Mangalagiri Local News :తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలం- ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

యువగళం పాదయాత్రకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ఆయన, యువగళం ఏపీ రాజకీయాల్లో గేమ్‌చేంజర్‌గా నిలిచిందని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఈ పాదయాత్ర సాగిందన్నారు. 2023 జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్లు కొనసాగిందని గుర్తుచేశారు.managalagiri news:సమాచారచట్టం విలువలు కాపాడాలి: కమిషనర్ రెహానా బేగం

సోషల్ మీడియా, ప్రత్యక్ష కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని సూచించిన ఆయన, 2029 ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని ప్రతి బూత్‌ను బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నారా లోకేష్‌తో పాటు పార్టీ నేతలు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker