విద్యార్థి కోరిక మేర సైకిల్ అందజేత
స్కూల్ నుంచి మా ఇల్లు రెండు కిలోమీటర్ల దూరం ఉంది. రోజూ అక్కడి నుంచి రాలేకపోతున్నాను. నాకు ఒక సైకిల్ కొనివ్వండి సార్.” అని నోరు తెరిచి అడిగిన విద్యార్థి కోరికను గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు స్పందించారు. విద్యార్థి కోరిన రెండు రోజుల్లోనే అతనికి సైకిల్ కొని ఇచ్చారు.
తెనాలి మండలం నందివెలుగులోని జడ్పీ హైస్కూల్ లో నూతన భవనాలను పెమ్మసాని గారు ఇటీవలే ప్రారంభించారు. కార్యక్రమం ముగించుకొని తిరిగి వస్తుండగా అదే స్కూల్లో చదువుకుంటున్న ఏడో తరగతి చదువుతున్న చదువుకుంటున్న మందా శరత్ బాబు అనే విద్యార్థి పెమసాని గారి కారు వద్దకు వచ్చి ఆయన ఆపాడు. నూతనంగా ఏర్పాటుచేసిన స్కూలుకు వచ్చేందుకు రోజు ఇబ్బంది పడుతున్నానని, స్కూల్ బ్యాగ్ మోయలేక భుజాలు నెప్పి పడుతున్నాయని వివరిస్తూ సదరు విద్యార్థి పెమసాని గారికి తన సమస్యను వివరించాడు. సమస్యను సావధానంగా అడిగి తెలుసుకున్న పెమ్మసాని గారు స్పందిస్తూ.. “నువ్వు బాగా చదువుకుంటానని మాట ఇస్తే సైకిల్ కొనిస్తాను.” అని చెప్పిన రెండు రోజుల్లోనే ఆ కుర్రాడి ఇంటికి ఒక నూతన సైకిల్ ను కొని ఇచ్చి పంపించారు.
శరత్ బాబుకు సైకిల్ అందజేసిన తర్వాత ఢిల్లీలో ఉన్న పెమ్మసాని గారు వీడియో కాల్ ద్వారా ఆ కుర్రాడితో ఫోన్లో మాట్లాడారు. కేంద్ర మంత్రి తో ఫోన్లో మాట్లాడుతూ సదరు విద్యార్థి ధన్యవాదాలు తెలియజేస్తూనే, ఆనంద భాష్పాలతో తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఎన్నో ఏళ్లుగా తాను తన మామయ్యను తల్లిని సైకిల్ కొనిమని అడుగుతున్నానని, అయితే తమకున్న ఆర్థిక ఇబ్బంది కారణంగా కొనుక్కోలేకపోయారని తెలిపాడు. నందివెలుగులో స్కూల్ భవనాల ప్రారంభోత్సవం నాడు పెమ్మసాని గారు మాట్లాడుతూ ఎవరికీ ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని ఆయన చెప్పిన విధానం తనకు నచ్చిందని చెప్పాడు.
ఊహించలేదు – శరత్ బాబు, విద్యార్థి
చాలామంది తమకు రోడ్లు కావాలి, నీళ్లు కావాలి అని అడగడం తాను చూశానని, అయితే స్కూలుకు 2 కిలోమీటర్ల దూరం నుంచి నిత్యం నడుచుకుని వస్తున్న నాకు ఒక సైకిల్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో పెమ్మసాని గారిని సాధారణంగా అడిగాను. అయితే పెమ్మసాని గారు గుర్తుపెట్టుకుని మరీ నాకు సైకిల్ కొని, పంపిస్తారని నిజంగా ఊహించలేదు.”
అందరి లాంటి నాయకులు కారని నిరూపించారు – సోనీ, శరత్ బాబుకు తల్లి
పెమ్మసాని గారు తాను అందరిలాంటి నాయకుడిని కానని నిరూపించుకున్నారు. కూలి చేసుకుని జీవనం సాగించే మాకు ఒక సైకిల్ కొనాలంటే సాధారణమైన విషయం కాదు. స్కూల్ ఓపెనింగ్ కు వచ్చిన పెమసాని గారిని సైకిల్ అడిగానని, ఇస్తానన్నారని మా అబ్బాయి చెబితే అందరూ అలాగే చెబుతారు, చెప్పినంత మాత్రాన ఎవరూ ఇవ్వరు అని నా కొడుకు కు ఆరోజు చెప్పాను. ఒక చిన్న పిల్లాడి మనసు అర్థం చేసుకొని స్పందించిన పెమ్మసాని గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
ఇచ్చిన మాట రెండు రోజుల్లో నెరవేర్చారు – ధూళిపాళ్ల పవన్, నందివెలుగు సర్పంచ్
మా నందివెలుగు స్కూలు ప్రారంభోత్సవానికి సహకరించడమే కాకుండా, మా ఊరి విద్యార్థికి అడిగిన వెంటనే పెమ్మసాని గారు స్పందించారు. కోరిందే తడవుగా రెండు రోజుల్లో సైకిల్ ని ఇంటికి పంపించి మరీ మాట నిలబెట్టుకున్న తరుణంలో ఆ విద్యార్థి ఆనందభాష్పాలతో పెమ్మసాని గారికి ధన్యవాదాలు తెలియజేయడం చాలా సంతోషం అనిపించింది.