
Bapatla:chirala:06-12-25:-వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయం జరుగుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారంపై ఎస్ఐ భాగ్యరాజు నేతృత్వంలో పోలీసులు దాడులు నిర్వహించారు. వెదుళ్ళపల్లి విఆర్ఓ, స్టువర్టుపురం విఆర్ఓ కూడా ఈ దాడుల్లో పాల్గొన్నారు.వృక్షనగర్ ప్రాంతంలో జరిగిన దాడిలో మేడ్రగుత్తి ప్రతాప్ గంజాయి విక్రయిస్తున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. అదే సమయంలో సాయి హర్షద్ రెడ్డి అనే వ్యక్తి ప్రతాప్ నుంచి గంజాయి కొనుగోలు చేసినట్టు నిర్ధారణ కావడంతో, ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం VRΟల సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. కోర్టు వారు ఈ నెల 19 వరకు రిమాండ్‌కు తరలించారు.
ఈ సందర్భంలో ఎస్ఐ భాగ్యరాజు మాట్లాడుతూ, వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ హద్దుల్లో గంజాయి, మత్తు బిళ్లు, నాటు సారాయి వంటి నిషేధిత పదార్థాలు విక్రయించే వారు, కొనుగోలు చేసే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా అమలు చేస్తామని హెచ్చరించారు.
అలాగే, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచార దాతల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.







