
కామన్‌వెల్త్ మెడికల్ అసోసియేషన్ (CMA) మరియు కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ (KNRUHS) సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 22–23 తేదీల్లో హైదరాబాద్ బంజారా హిల్స్‌లో కామన్‌వెల్త్ AI గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబడనుంది. “Encourage – Educate – Empower” అనే భావంతో జరగనున్న ఈ సదస్సు వైద్య రంగంలో కృత్రిమ మేధస్సు (AI), డిజిటల్ హెల్త్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్ మెడిసిన్ రంగాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను ఒక వేదికపైకి రానుంది. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం వైద్య రంగంలో AI వినియోగాన్ని విస్తృతం చేయడం, విద్యార్థులు, వైద్యులు, పరిశోధకులు అంతర్జాతీయ వైద్య సాంకేతికతలపై అవగాహన పెంపొందించడం, ఆరోగ్య రంగంలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను వేగవంతం చేయడం.
hyderabad: ఎకరానికి ₹177 కోట్లకు అమ్ముడై కొత్త రికార్డు:హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త రికార్డు:
సుప్రీం కోర్ట్ జడ్జి నుండి సీఎం వరకు—అతిథుల జాబితా
ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్‌కు ముఖ్య అతిథులుగా గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, సుప్రీం కోర్టు జడ్జి ఉజ్జల్ భుయాన్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లూ భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజా నరసింహ, శ్రీధర్ బాబు, జుప్పల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, పోన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రివారి సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి కూడా సమ్మిట్‌లో పాల్గొననున్నారు. అదనంగా, అనసూయ, కొండా సురేఖ, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, అద్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వెంకటేశ్వర్ల చారి, ఎంపీలు మల్లూ రవి మరియు ప్రసాదరావు దగుమల్ల, IMA జాతీయ అధ్యక్షుడు దిలీప్ భనుషాలి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్ IAS, సాంజయ్ కుమార్ IAS, డాక్టర్ క్రిస్టినా చొంగ్తు IAS, కాంటినెంటల్ హాస్పిటల్స్ చైర్మన్ గురు ఎన్ రెడ్డి, అధ్యక్షుడు టి. రఘునాథ్ రెడ్డి, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్, అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్, హోమ్ విభాగ ప్రత్యేక కార్యదర్శి సి.వి. ఆనంద్, టెలంగానా డిజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగనుంది. హైదరాబాద్‌లో IPSOCON–2025
సదస్సులో పాల్గొనే కామన్‌వెల్త్ మెడికల్ అసోసియేషన్ అంతర్జాతీయ ప్రతినిధుల్లో అధ్యక్షుడు జె.ఏ. జయలాల్, మాజీ అధ్యక్షుడు మురుగరాజ్ రాజతురై, AI & డిజిటల్ హెల్త్ కమిటీ చైర్మన్ వజీర దిసానాయకే, కో–చైర్మన్ ఎస్. అరుల్రాజ్, భారత AI కమిటీ అధినేత ప్రబు కుమార్ చల్లగలి, నైజీరియా ప్రతినిధి ఓసాహోన్ ఎనాబులే, మలేసియా వైద్య నాయకురాలు మర్లిండా షాజలేన్, యుకే, మాల్టా, ట్రినిడాడ్, శ్రీలంక, జాంబియా తదితర దేశాల వైద్య నాయకులు కూడా పాల్గొననున్నారు.
కామన్‌వెల్త్ వైద్య నిపుణుల ప్రతినిధి బృందం
సమ్మిట్ స్పీకర్లలో జయేష్ రంజన్ IAS, డాక్టర్ కె.ఎం. అబుల్ హసన్ (Hospital Board of India), IIT హైదరాబాద్ ప్రొఫెసర్ బాపిరాజు, మాజీ IAS అజయ్ మిశ్రా, AI నిపుణుడు మోహన్ సిలాపరసెట్టి, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు డాక్టర్ ప్రదీప్ VM, ప్రభుత్వ అధికారి సర్వేష్ సింగ్, ISB ప్రొఫెసర్ విశాల్ కరుంగులం, AIG హాస్పిటల్స్ వైద్య నిపుణులు డా. అనురాధ సెకరన్, స్ట్రోక్ ఇమేజింగ్ నిపుణుడు డా. శివకుమార్ ధనరాజ్, AIIMS డేటా సెంటర్ అధిపతి రాజా పొలాడి తదితరులు ఉన్నారు.
సమ్మిట్ సందర్భంగా కామన్‌వెల్త్ డిజిటల్ హెల్త్ ఫెలోషిప్ (FCAD) కోర్సుకు నమోదు అవుతున్న వైద్య విద్యార్థులు, ఇంటర్న్స్, ఫ్యాకల్టీ, రీసెర్చర్లు AI ఆధారిత డయాగ్నస్టిక్స్, స్మార్ట్ ఆసుపత్రుల నిర్మాణం, ఆరోగ్య డాటా భద్రత, అంతర్జాతీయ వైద్య ప్రమాణాలు, ఆరోగ్య సేవల డిజిటలైజేషన్ వంటి అంశాలపై ఆధునిక శిక్షణ, మార్గదర్శకత పొందనున్నారు. ఈ సమ్మిట్ భారత్‌ను, ముఖ్యంగా హైదరాబాద్‌ను, ప్రపంచ వైద్య–AI హబ్ గా నిలిపే దిశగా కీలక మైలురాయిగా భావిస్తున్నారు. నిర్వాహకుల ప్రకారం వేలాది మంది మెడికల్ విద్యార్థులు, వైద్యులు, ఆరోగ్య పరిశోధకులు పాల్గొనే అవకాశం ఉంది.
నవంబర్ 22 – హాల్–A కార్యక్రమాలు, ప్రసంగాలు
సమ్మిట్ మొదటి రోజు నవంబర్ 22న హాల్–Aలో వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై వివిధ సెషన్లు నిర్వహించబోతున్నారు. ఉదయం 8:45 గంటలకు CMA అధ్యక్షుడు డా. జే. ఎ. జయలాల్ స్వాగత ప్రసంగంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత “AI — Exploring The Basics & Beyond” అంశంపై CMA AI & డిజిటల్ హెల్త్ చైర్మన్ డా. వజీరా హెచ్. డబ్ల్యూ. దిసానాయకే, AI నిపుణుడు మోహన్ సిలాపరసెట్టి ప్రసంగిస్తారు.
9:20 కు “AI–Google Doctor–Challenges” అనే అంశంపై డా. ప్రభు కుమార్ చల్లగలీ (Convenor, CMA AI Committee), డా. కార్తిక్ ప్రభు (IMA తమిళనాడు), IMA BHills హోనీ సెక్రటరీ డా. జి. గోపాలకృష్ణ మాట్లాడనున్నారు. అనంతరం “Empowering Medical Professionals With AI” పై IIT Hyderabad నుండి ప్రొ. బాపిరాజు నాయకత్వంలో డా. వసంత రావు, డా. విజయ రావు చర్చించనున్నారు.
10:00 గంటలకు “AI in Healthcare Research & Publication” పై డా. కమల కానపర్తి (ఎక్స్ ESIC హాస్పిటల్), డా. రాకేష్ వడ్డిరాజు, డా. శేషు మాధవ్ ప్రసంగిస్తారు. 10:20కు “AI in Revenue Cycle & Patient Acquisition” పై డా. సాంగీతా రెడ్డి (Apollo), డా. రామణ పూజారి, డా. పుల్లారావు అభిప్రాయాలు వెల్లడిస్తారు. 10:40 నుంచి టీ బ్రేక్ అనంతరం “AI in Healthcare Manpower & Challenges” సెషన్‌లో డా. సూరజ్ భంసాలి, డా. సంతోష్, డా. బసవ రాజు ప్రసంగిస్తారు.
11:20 తర్వాత “AI in Healthcare Implementation” గురించి డా. శ్రవణ్ కుమార్ (Apollo) వివరిస్తారు. 11:40కు సుప్రీంకోర్టు జడ్జి ఉజ్జల్ భుయాన్ “AI & Law” అంశాన్ని వివరించగా, 12:00కు సైబర్ సెక్యూరిటీ నిపుణుడు డా. ప్రదీప్ VM “AI Cybersecurity” పై మాట్లాడనున్నారు. 12:20కు CMA అధ్యక్షుడు డా. జయలాల్ “Future of Clinical Medicine in AI Era” అంశాన్ని వివరించగా, 12:40కు IAS అధికారి జయేష్ రంజన్, మాజీ IAS అజయ్ మిశ్రా “AI & Public Policy” పై చర్చిస్తారు.
1:45కు లంచ్ బ్రేక్ అనంతరం AIG హాస్పిటల్స్ డైరెక్టర్ డా. జి.వి. రావు “AI in Clinical Judgment” పై మాట్లాడుతూ, 2:05 కు గ్లోబల్ డీప్‌టెక్ ఫోరం సభ్యుడు సర్వేష్ సింగ్ “Patient Safety with AI” పై వివరించనున్నారు. 2:25కు ISB నుండి ప్రొ. విశాల్ కరుంగులం “Future Challenges in AI” అంశాన్ని వివరించనున్నాడు.
2:45లో APV హెక్టర్ నుండి వెంకటేశ్ బొండ “AI in Judicial Decision Making,” 3:05కు AIG పాథాలజీ డైరెక్టర్ డా. అనురాధ సెకరన్ “AI–Enhanced Pathology,” 3:25కు ప్రొ. రాజేష్ శివప్రకాశం “AI Clinical Diagnosis & Management” పై ప్రసంగిస్తారు.
3:45 నుంచి CMA కోడ్ ఆఫ్ కన్డక్ట్ ఫర్ AI సెషన్‌లో డా. అరుల్రాజ్, డా. అబుల్ హసన్, డా. వి.ఎస్. హరిహరణ్ మాట్లాడుతారు. చివరి సెషన్‌గా 4:15 నుంచి “AI Hands-On Demo Workshop” ప్రొ. బాపిరాజు, AI నిపుణుడు మోహన్ సిలాపరశెట్టి ఆధ్వర్యంలో జరుగుతుంది. 5:15కు డే–1 విలువాయనం, అసెస్‌మెంట్ కార్యక్రమంతో ముగుస్తుంది.
నవంబర్ 22న Hall-Bలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు AI Pitch Fest నిర్వహించబడనుంది. ఇందులో సుమారు 30 AI హెల్త్ స్టార్టప్‌లు తమ ప్రాజెక్టులను ప్రదర్శించనున్నాయి మరియు ఇవి జె.ఎ. జయలాల్, ఎస్. అరుల్రాజ్, సర్వేష్ సింగ్, రాజేష్ శివప్రకాశం, శివకుమార్ ధనరాజ్, మురుగరాజ్, Botsystems USA వ్యవస్థాపకుడు విజయ్ ఆనంద్ శివప్రకాశం, బెంగళూరు ఆధారిత ఇన్వెస్టర్ హరి సుబ్రహ్మణ్యం వంటి నిపుణుల బృందం ద్వారా సమీక్షించబడతాయి. అనంతరం అదే రోజు సాయంత్రం విజేతలను ప్రకటించి అవార్డులు ప్రదానం చేయనున్నారు.
మరుసటి రోజు నవంబర్ 23న Hall-Aలో ముఖ్య సెషన్లు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. మొదటి సెషన్‌లో రాజా పొలాడి “క్లినికల్ మెడిసిన్‌లో రిసెర్చ్ వినియోగం”పై మాట్లాడనున్నారు. అనంతరం ఎస్. అరుల్రాజ్ నేతృత్వంలో “హార్ట్ కేర్‌లో AI పాత్ర”పై చర్చ జరుగుతుంది. తరువాత వి. బాలకిష్టా రెడ్డి “వైద్యుడు-రోగి సంబంధాల భవిష్యత్‌లో AI ప్రాధాన్యం”పై ప్రసంగించనున్నారు. మోహన్ సిలాపరసెట్టి “Google Agentic AI”పై సెషన్ నిర్వహించగా, తరువాత రాజేష్ శివప్రకాశం “సర్జరీ రంగంలో AI-రోబోటిక్స్ ప్రయోజనాలు”ను వివరించనున్నారు.
తరువాత కాంటినెంటల్ హాస్పిటల్స్ చైర్మన్ గురు ఎన్ రెడ్డి “Healthcare 2.0 & AI”పై ప్రసంగించనున్నారు. అలాగే శివకుమార్ ధనరాజ్ “AI డాక్టర్లను భర్తీ చేయగలదా?” అనే డిబేట్‌ను నడపనున్నారు. ఆసుపత్రుల్లో AI టూల్స్ అమలు ప్రక్రియపై మహేష్ BMS చర్చించగా, డా. విష్ణు రావు వీరపనేని, డా. మదన్ మోహన్ పర్యావరణ కాలుష్యం-శ్వాస వ్యవస్థ సమస్యలపై AI పరిశోధన అంశాలను వివరించనున్నారు.
https://youtu.be/uvr9xLZFx6U?si=XNu4tkGjMxSk1nCWఆ తరువాత కే. జంగిరెడ్డి “ఆర్థో-రోబోటిక్ శస్త్రచికిత్సలో AI”పై, కరుణాకర్ రాపోలు “TAVI & AI”పై మాట్లాడనున్నారు. అనంతరం CMA Convocation కార్యక్రమం నిర్వహించబడనుంది. ఈ రెండు రోజులలో జరగబోయే ఈ సెషన్లు వైద్యరంగంలో కృత్రిమ మేధస్సు వినియోగం, హెల్త్-టెక్ ఇన్నోవేషన్, శస్త్రచికిత్సా సాంకేతికతలు, హాస్పిటల్ మేనేజ్‌మెంట్, పాలసీ, డేటా భద్రత, AI-డయాగ్నస్టిక్స్ వంటి రంగాలలో కీలక మార్గదర్శకత్వం అందించనున్నాయని నిర్వాహకులు తెలిపారు.
22 నవంబర్ – Hall-B: AI Pitch Fest
నవంబర్ 22వ తేదీన Hall-Bలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు AI Pitch Fest నిర్వహించబడనుంది. మొత్తం 30 హెల్త్-AI స్టార్టప్‌లు తమ ఇన్నోవేషన్లను ప్రదర్శించనుండగా, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అక్రిడిటేషన్ మరియు సర్టిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈ పరిశీలనా కమిటీలో జె.ఎ. జయలాల్, ఎస్. అరుల్రాజ్, సర్వేష్ సింగ్, రాజేష్ శివప్రకాశం, శివకుమార్ ధనరాజ్, మురుగరాజ్, అమెరికా-బేస్డ్ Botsystems వ్యవస్థాపకుడు విజయ్ ఆనంద్ శివప్రకాశం, బెంగళూరు ఇన్వెస్టర్ హరి సుబ్రహ్మణ్యం పాల్గొనబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు విజేతల పేర్లు ప్రకటించి అవార్డులు ప్రదానం చేయనున్నారు.
23 నవంబర్ – Hall-A: AI & Healthcare Future Sessions
రెండవ రోజు Hall-Aలో ఉదయం 9 గంటలకు సెషన్లు ప్రారంభమవుతాయి. మొదటగా రాజా పొలాడి “క్లినికల్ ప్రాక్టీస్‌లో రిసెర్చ్ ట్రాన్స్‌ఫర్మేషన్” అంశంపై ప్రసంగించనున్నారు. అనంతరం డా. ఎస్. అరుల్రాజ్ “కార్డియాలజీలో AI విప్లవం” గురించి, డా. రాజీవ్ మెనన్ మరియు డా. అనుజ్ కపాడియా చైర్మన్‌లుగా పాల్గొంటూ నిర్వహించనున్నారు. ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి “డాక్టర్-పేషెంట్ సంబంధాల్లో AI భవిష్యత్తు” గురించి వివరించనున్నారు. మోహన్ సిలాపరసెట్టి “Agentic AI – Google AI Asia”పై మాట్లాడనున్నారు. తరువాత రాజేష్ శివప్రకాశం “సర్జరీలో AI ఆధారిత రోబోటిక్స్” అంశాన్ని వివరించనున్నారు.
విరామం అనంతరం Continental Hospitals చైర్మన్ గురు ఎన్ రెడ్డి “Healthcare 2.0 – AI Paradigm Shift” పై మాట్లాడనున్నారు. తరువాత “Doctors ని AI రీప్లేస్ చేస్తుందా?” అనే హాట్ టాపిక్‌పై శివకుమార్ ధనరాజ్ డిబేట్ నిర్వహించనున్నారు. AI టూల్స్ అమలు విధానంపై మహేష్ BMS సెషన్ నిర్వహించగా, పర్యావరణ కాలుష్యం-శ్వాస సమస్యలపై AI పాత్ర గురించి డాక్టర్ విష్ణు రావు వీరపనేని, డా. మదన్ మోహన్ మాట్లాడనున్నారు. అనంతరం డా. కే. జంగిరెడ్డి “రోబోటిక్ ఆర్థోపెడిక్స్‌లో AI వినియోగం”పై, డా. కరుణాకర్ రాపోలు “TAVI & AI”పై ప్రసంగించనున్నారు. కార్యక్రమ ముగింపుగా CMA Convocation నిర్వహించబడనుంది.
 
 
 






