హైదరాబాద్, సెప్టెంబర్ 2025: భారత మానసిక వైద్యుల సంఘం (Indian Psychiatric Society) సౌత్ జోనల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో, తెలంగాణ రాష్ట్ర బ్రాంచ్ సహకారంతో 58వ వార్షిక సదస్సు “IPSOCON 2025” అక్టోబర్ 24, 25, 26 తేదీలలో హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సదస్సు ప్రధాన థీమ్ **“జీవితాంతం ADHD అవగాహనలో కొత్త దిశలు, కొత్త పరిణామాలు”**గా నిర్ణయించారు.
సదస్సులో ప్రపంచ ప్రఖ్యాత మానసిక ఆరోగ్య నిపుణులు పాల్గొని, చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ADHD (Attention Deficit Hyperactivity Disorder) ప్రభావం, డయాగ్నస్టిక్ పద్ధతులు, సైకోసోషల్ చికిత్సలు, ఔషధ విధానాలు, కో-మోర్బిడిటీ సమస్యలపై విస్తృతంగా చర్చించనున్నారు. నిర్వాహకులు ఈ కాన్ఫరెన్స్‌ను సమగ్ర శిక్షణా వేదికగా మార్చేందుకు ప్రత్యేకంగా సిద్ధమయ్యారు.
హైదరాబాద్ నగరం చారిత్రక వారసత్వం, సంస్కృతి, ఆధునిక ఐటీ హబ్‌గానూ ప్రసిద్ధి చెందింది. చార్మినార్, గోల్కొండ కోట, యాదగిరిగుట్ట, సమానత్వ విగ్రహం వంటి పర్యాటక కట్టడాలు ఈ సదస్సులో పాల్గొనబోయే వారికి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. నిర్వాహకులు శాస్త్రీయ చర్చలతో పాటు హైదరాబాద్‌కు ప్రత్యేకమైన నవాబీ అతిథి సత్కారం అందించనున్నట్లు అధ్యక్షుడు డా. ఎం. ఉమాశంకర్, CME చైర్మన్ డా. పి. కిశన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జార్జ్ రెడ్డి, ఆర్గనైజింగ్ చైర్మన్ డా. యర్రా శ్రీధర్రాజు, ట్రెజరర్ డా. విశాల్ ఆకులతెలిపారు
📧 ఇమెయిల్: ipsocon2025@gmail.com
🌐 వెబ్‌సైట్: www.ipsocon2025.com