chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

Gandhinagar lo vishadham:గాంధీనగర్‌లో విషాదం: భార్యాభర్తల కలహంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

Hyderabad:14-11-25:-గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్‌లో భార్యాభర్తల మధ్య గొడవ దారుణంతో ముగిసిన ఘటన చోటుచేసుకుంది. రెండు సంవత్సరాల క్రితం గాంధీనగర్‌కు చెందిన సురవి విశాల్ గౌడ్‌కు మల్లాపూర్‌కు చెందిన కావ్యతో వివాహం జరిగింది. ఓ ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న విశాల్, గత కొంతకాలంగా ఇంటి నుంచే పనిచేస్తున్నాడు.వివాహం అనంతరం నుంచే వీరిద్దరి మధ్య కలహాలు కొనసాగుతున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఇటీవల ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కూడా కేసు నమోదైనట్లు సమాచారం.

ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న విశాల్ గౌడ్ సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు బలవంతంగా ధ్వంసం చేసి లోపలికి వెళ్లగా, విశాల్ ఉరివేసుకుని కనిపించాడు. అతన్ని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.తమ కుమారుడు విశాల్ ఆత్మహత్యకు కోడలు కావ్య వేధింపులే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. విశాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker