chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

Gilla nu unit gaa: జిల్లాను యూనిట్‌గా తీసుకొని రిజర్వేషన్లు కేటాయించడం వల్ల బిసిలు నష్టపోతున్నారు-రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్‌ :25-11-25:- గ్రామపంచాయతీ ఎన్నికల్లో జిల్లాను యూనిట్‌గా తీసుకొని రిజర్వేషన్లు కేటాయించడం వల్ల బీసీలు తీవ్ర నష్టపోతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు.హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ— బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ప్రస్తుతం 22 శాతం కూడా సక్రమంగా అమలు చేయకపోవడం ఆందోళనకరం అని మండిపడ్డారు.

Gilla nu unit gaa: జిల్లాను యూనిట్‌గా తీసుకొని రిజర్వేషన్లు కేటాయించడం వల్ల బిసిలు నష్టపోతున్నారు-రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య

ప్రభుత్వం విడుదల చేసిన 46వ జీ.ఓ ప్రకారం బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉన్నా, కొన్ని జిల్లాల్లో 10 శాతం కూడా అమలు కాకపోవడం దురదృష్టకరమన్నారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకొని రిజర్వేషన్ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.అగ్రకులాల ప్రయోజనాలను కాపాడేందుకే బీసీల రిజర్వేషన్లు తగ్గించారని ఆరోపించిన ఆయన, బీసీలు సర్పంచులు అవడం కూడా కొందరు అగ్రవర్ణాలకు ఇష్టం లేని పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. బీసీలు చైతన్యంతో ముందుకు వస్తున్నారని, భవిష్యత్తులో చట్టసభల్లో సరైన రిజర్వేషన్లు సాధించే దిశగా పోరాటం కొనసాగుతుందని కృష్ణయ్య స్పష్టం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker