chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

Hyderabad Local News :రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడానికి విధి విధానాలు రూపొందించాలి- ప్రొఫెసర్ కోదండరామ్

Hyderabad:నాంపల్లి :- రాష్ట్రంలో నిలకడగా కొనసాగుతున్న రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకునేలా స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ప్రభుత్వాన్ని కోరారు. రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి సంబంధించి పలు సూచనలతో పాటు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను సేకరించి ప్రభుత్వానికి నివేదికగా అందజేస్తామని ఆయన తెలిపారు.

తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నాంపల్లిలోని జన సమితి పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరామ్ ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

Hyderabad Local News :రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడానికి విధి విధానాలు రూపొందించాలి- ప్రొఫెసర్ కోదండరామ్

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రొఫెసర్ కోదండరామ్, రాష్ట్ర జిడిపిలో సుమారు 25 శాతం వాటా కలిగిన రియల్ ఎస్టేట్ రంగాన్ని సజీవంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఉందన్నారు. ఈ రంగం అభివృద్ధి కోసం సమగ్రమైన, శాస్త్రీయమైన ఆలోచనలతో కూడిన ప్రతిపాదనలను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు.Hyderabad news

దీనికోసం ప్రత్యేకంగా ఒక సదస్సు నిర్వహించాలని సూచించిన ఆయన, ఆ సదస్సుకు రియల్ ఎస్టేట్ రంగంలోని ప్రముఖులు, అసోసియేషన్ నాయకులు, బిల్డర్లు, ప్రభుత్వ పెద్దలను ఆహ్వానించి విస్తృత స్థాయి చర్చ నిర్వహించాలని కోరారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్ సభ్యత్వాన్ని పెద్ద ఎత్తున చేపట్టి, లక్షల సంఖ్యలో ఉన్న రియల్ ఎస్టేట్ అసోసియేట్స్‌ను ఐక్యం చేసి ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని కోదండరామ్ పిలుపునిచ్చారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker