
సికింద్రాబాద్:- నియోజకవర్గం సీతాఫల్మండి డివిజన్ పరిధిలోని చిలకలగూడ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ నాయకుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ ఇంచార్జ్ అదం సంతోష్ కుమార్ నేతృత్వంలో సంబంధిత అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా డ్రైనేజ్, తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మత్తులు, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి సమస్యలపై అధికారులతో సమగ్రంగా చర్చించి, వాటిని ఆలస్యం లేకుండా పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఇబ్బందులను వేగంగా పరిష్కరించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అదం సంతోష్ కుమార్ స్పష్టం చేశారు.
అదేవిధంగా, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి అర్హత కుటుంబానికి చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరితేనే పాలనపై విశ్వాసం పెరుగుతుందని అన్నారు.http://secundarabad
రానున్న GHMC ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా క్యాడర్లో ఉత్సాహం నింపుతూ, ప్రతి కార్యకర్త ప్రజల్లో ఉండి పార్టీ విధానాలను విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ బలమని, అదే ఎన్నికల్లో విజయానికి పునాది అవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సందీప్, జలందర్ రెడ్డి, జగ్గు, జాహేంగీర్, షకీల్ ఖాన్, వాహిద్దుద్దీన్ కొండల్, సురేష్ లాల్, అమర్నాథ్, చక్రం, శిల్ప, కన్ఫనా, బబ్లు, అనిల్, గంట రాజు తదితర స్థానిక కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.










