తాను చనిపోతూ కూడా మరో ఐదుగురికి ప్రాణదానం చేశారు 65 ఏళ్ల మహిళ. భట్టిప్రోలు మండలం ఐలవరం కి చెందిన ఆకురాతి రత్నకుమారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చికిత్స నిమిత్తం ఇటీవల రమేష్ హాస్పిటల్ లో చేరారు. 3 రోజుల చికిత్స చేసినప్పటికీ బ్రెయిన్ డెడ్ అయ్యారు. అయితే రత్నకుమారి అవయువాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. జీవన్ ధాన్ పధకం ద్వారా కిడ్నీ, లివర్, కళ్ళు దానం చేశారు. ఈ వివరాలను రమేష్ హాస్పిటల్ ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేటర్ లు అనూష, అఖిలేష్ మీడియాకు వెల్లడించారు. మరణాంతరం అవయువాలను దానం చేయడం వల్ల ప్రాణాపాయంలో ఉన్న ఎందరికో పునర్ జన్మను ఇవ్వొచ్చు అని తెలిపారు. అవయువదానం పట్ల అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. అదేవిధంగా అవయువాలు దెబ్బతిని ఎందరో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం గమనించి ఆర్గాన్ డొనేషన్ కి అంగీకరించినట్లు కుటుంబ సభ్యులు నాగమణి, బాలాజీ తెలిపారు. అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు.
GUNTUR DISTRICT NEWS: అవయువదానంతో మరో ఐదుగురికి ప్రాణదానం

Oplus_16908288
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
38°C
Vijayawada
scattered clouds
38° _ 38°
39%
5 km/h
Wed
38 °C
Thu
41 °C
Fri
40 °C


