GUNTUR DISTRICT NEWS: ఇంటర్ ఫలితాల ప్రకటన- మాంటిస్సోరి పూర్వ విద్యార్ధులకు అభినందన సభ

Karthik
6 Views

ఇటీవల విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాలలో రాష్ట్రస్థాయి అత్యుత్తమ ఫలితాలు సాధించిన మాంటిస్సోరి పూర్వ విద్యార్ధులను బుధవారం స్కూల్ ఆవరణలో యాజమాన్యం ఘనంగా సత్కరించింది. వీరిలో 1000 కి 990 సాధించిన SK. గౌసల్ అజాం, 989 సాధించిన ఎస్‌కె.ప్రజ్ఞిత, 985 సాదించిన యు. నర్మద, మరియు జూనియర్ ఇంటర్‌లో 470 కి 464 సాధించిన కె. దీపామృత, కె.గాయత్రి :463 సాధించిన పి.శ్రీనిజ; 462 సాధించిన S. షన్మిత, V. అక్షయషణ్ముఖ ; 461 సాధించిన G. శివాని, U.కారుణ్య, మొఘల్. గౌసియ విద్యార్ధులను ప్రత్యేకంగా అభినందించారు. సంస్థ అధినేత కే.వి. సెబాస్టియన్ మాట్లాడుతూ మాంటిస్సోరి లో చదివిన విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని, మా సంస్థకు గర్వకారణంగా నిలిచారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కరెస్పాండెంట్ మంజు సెబాస్టియన్ మాట్లాడుతూ మా పాఠశాలలో చదివిన విద్యార్ధులు అన్ని రంగాలలో ముందంజలో ఉండటం మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంలో తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం చేస్తున్న కృషిని కొనియాడారు.

Author
Share This Article
Leave a review