GUNTUR CITY NEWS: జీవితంలో ఉపాధ్యాయురాలిగా పనిచేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది

Karthik
6 Views

టిడిపి సీనియర్ నాయకుడు దాసరి రాజా మాస్టారు సతీమణి శ్రీదేవి ఉద్యోగ విరమణ చేశారు. కాసు సాయమ్మ హైస్కూల్లో సైన్స్ టీచరుగా పనిచేస్తూ ఉద్యోగ విరమణచేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ మహోత్సవాన్ని స్కూలు ఆవరణలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, చదలవాడ అరవింద్ బాబు, ఇతర నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొని శ్రీదేవికి అభినందనలు తెలిపారు. రాజా మాస్టర్, శ్రీదేవి దంపతులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో నిబద్ధతతో పనిచేసే పేద విద్యార్థులను తీర్చిదిద్దారని చెప్పారు. అదేవిధంగా తన జీవితంలో ఉపాధ్యాయురాలిగా పనిచేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని సందర్భంగా శ్రీదేవి వెల్లడించారు.

Author
Share This Article
Leave a review