పర్చూరులో యూపీ పాఠశాలకు రోటరీ క్లబ్ బీరువా బహుకరణ

City News Telugu

పర్చూరు నియోజకవర్గంలోని కొమరనేని వారి పాలెం యూపీ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ పర్చూరు సెంట్రల్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు తోకల కృష్ణమోహన్ నాయకత్వంలో కొమ్మాలపాటి మనోజ్ కుమార్, లక్ష్మిసుమ దంపతులు తమ కుటుంబ సభ్యుడు మనోజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా పాఠశాలకు బీరువాను బహుకరించారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు తోకల కృష్ణమోహన్ మాట్లాడుతూ, పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను భవిష్యత్తులో కూడా అందించేందుకు క్లబ్ కట్టుబడి ఉందని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ కోమటి ఆంజనేయులు, సభ్యులు పోలిశెట్టి చంద్రశేఖర రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి భారతి దేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Share This Article
Leave a review