గుంటూరు, ఏప్రిల్ 18 (ప్రతినిధి):Vignan University నిర్వహించిన వీశాట్–2026 ఫేజ్–1 (విజ్ఞాన్ స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్) ప్రవేశ పరీక్ష ఫలితాలను ఇంచార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.వి. కృష్ణకిషోర్ శనివారం విడుదల చేశారు. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన లభించగా, సుమారు 61 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 42 వేల మంది ప్రవేశాలకు అర్హత సాధించినట్లు తెలిపారు. https://vignan.ac.in/vsatresult/
విజ్ఞాన్స్ యూనివర్సిటీ ఇంచార్జి వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కేవీ క్రిష్ణకిషోర్ మాట్లాడుతూ వీశాట్‌లో తొలి పది ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలను వెల్లడించారు. వీశాట్–2026 ప్రవేశ పరీక్ష ఫలితాలు యూనివర్సిటీ వెబ్‌సైట్ https://vignan.ac.in/vsatresult/ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే విద్యార్థుల సెల్‌ఫోన్లకు ర్యాంకులు వివరాలను పంపిస్తామని తెలియజేసారు. మొదటి పది ర్యాంకులు సాధించిన విద్యార్థులు..
- తిగుళ్ల సాత్విక్ – సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
- బానోత్ సంజయ్ – ఖమ్మం, తెలంగాణ
- పీ. మౌనిష్ – కడప, ఆంధ్రప్రదేశ్
- చితి తోటి హోషిక్ – ఎన్‌టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్
- రాయపూడి జశ్వంత్ నాయుడు – గుంటూరు,ఆంధ్రప్రదేశ్
- కే.సాకేత్ చౌహాన్ – సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
- దామెర్ల వెంకట సిద్ధార్థ రాయ్ – గుంటూరు, ఆంధ్రప్రదేశ్
- గుంటోజు ఉమేష్ చంద్ర – మేడ్చల్, తెలంగాణ
- సంగు భరత్ చంద్రా రెడ్డి – ప్రకాశం, ఆంధ్రప్రదేశ్
- ఎం. పూర్ణ చంద్రశేఖర్ – విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
వీశాట్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు అందజేస్తామని తెలిపారు. 1 నుంచి 50 ర్యాంకుల మధ్య ఉన్నవారికి 50%, 51 నుంచి 200 ర్యాంకుల వారికి 25%, 201 నుంచి 2000 ర్యాంకుల వారికి 10% స్కాలర్‌షిప్‌ను నాలుగేళ్లపాటు అందజేస్తారు. అదేవిధంగా జేఈఈ మెయిన్స్, ఎంసెట్ ర్యాంకులు మరియు ఇంటర్మీడియట్ మార్కులను కూడా ప్రవేశాలకు పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు.
ఇంటర్‌లో 970కి పైగా మార్కులు సాధించిన వారికి 50%, 950–969 మధ్య మార్కులు సాధించిన వారికి 25%, 920–949 మార్కులు పొందిన వారికి 10% స్కాలర్‌షిప్‌లు అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే జేఈఈ మెయిన్స్‌లో 95 పర్సంటైల్ పైగా సాధించిన వారికి 75% వరకు స్కాలర్‌షిప్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
గుంటూరు మరియు హైదరాబాద్ క్యాంపస్‌లలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 22 నుంచి 27 వరకు మొదటి విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వీశాట్–2026 ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు, విద్యార్థుల మొబైల్ ఫోన్లకు ర్యాంకులు పంపిస్తున్నట్లు వెల్లడించారు.
వీశాట్–2026లో తొలి పది ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలను కూడా ప్రకటించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించడం విశేషమని తెలిపారు.
విశ్వవిద్యాలయం పరిశ్రమలకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందిస్తూ, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, నానో టెక్నాలజీ వంటి ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టినట్లు వైస్ ఛాన్సలర్ పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రాక్టికల్ పరిజ్ఞానం పెంపొందించేందుకు ల్యాబ్‌లు, ప్రాజెక్టులు, పరిశ్రమల అనుభవం కల్పిస్తున్నామని తెలిపారు.
వర్సిటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్ డీన్ ప్రొఫెసర్ ధూళిపాళ్ల విజయకృష్ణ మాట్లాడుతూ, విద్యార్థులకు 200 గంటల ప్రత్యేక క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ అందిస్తున్నామని, దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. అమెజాన్, సిస్కో, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ కంపెనీల్లో విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తున్నారని వెల్లడించారు.
రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీఎంవీ రావు మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి నిపుణులుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా అంతర్జాతీయ యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. అలాగే సివిల్స్, బ్యాంకింగ్, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రత్యేక కోచింగ్ కూడా అందిస్తున్నామని చెప్పారు.
ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.48 కోట్లకు పైగా స్కాలర్‌షిప్‌లు అందించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 25% నుంచి 100% వరకు ఫీజు రాయితీలు ఇస్తున్నట్లు డైరెక్టర్ అడ్మిషన్స్ తెలిపారు. పరిశోధనల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ నిధులు పొందుతూ, వేలాది పరిశోధనా పత్రాలు ప్రచురించినట్లు వివరించారు.



