గుంటూరు, ఏప్రిల్ 18:రాష్ట్రవ్యాప్తంగా విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో గుంటూరుకు చెందిన శ్రీమేధ విద్యాసంస్థలు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. బుధవారం విడుదలైన 2026 ఫలితాల్లో ఎం.ఇ.సి (MEC) మరియు సి.ఇ.సి (CEC) విభాగాల్లో ఈ సంస్థ విద్యార్థులు రికార్డు స్థాయి మార్కులతో రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలిచారు. గడిచిన 21 ఏళ్లుగా వరుస విజయాలను అందుకుంటూ, ఈ ఏడాది కూడా అదే పరంపరను కొనసాగించడం విశేషం.

సీనియర్ ఇంటర్ ఎం.ఇ.సి విభాగంలో డి. లీలా నాగ దుర్గ 1000కి గాను 982 మార్కులతో అద్భుత ప్రతిభ కనబరచగా, వై. తన్వి శ్రీ 981 మార్కులతో తర్వాతి స్థానంలో నిలిచింది. జూనియర్ ఇంటర్ విభాగంలోనూ శ్రీమేధ విద్యార్థులు దుమ్మురేపారు. ఎం. షకీర్ 494/500 మార్కులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, రామ్ చరణ్ తేజ్, శ్రీనివాసరావు మరియు రాహత్ ఫాతిమా తలా 493 మార్కులతో విజయభేరి మోగించారు. సి.ఇ.సి విభాగంలోనూ యుమ్-ఇ-రేయాన్ (489), బిందు రమ్య (912) అత్యుత్తమ మార్కులు సాధించారు.

ఈ ఘన విజయంపై సంస్థ చైర్మన్ అన్నా నందకిశోర్ స్పందిస్తూ.. విద్యార్థులపై తీసుకునే వ్యక్తిగత శ్రద్ధ, అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన మరియు క్రమశిక్షణతో కూడిన విద్యా ప్రణాళికే ఈ ఫలితాలకు కారణమని పేర్కొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకలో సంస్థ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీలక్ష్మి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమెంటోలు అందజేసి, వారిని మరియు వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు.




