
హైదరాబాద్: నవంబర్ 29:-సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం జరగలేదని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, బట్టి విక్రమార్కలు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య తీవ్రంగా విమర్శించారు.బషీర్‌బాగ్ అమ్మవారి ఆలయం నుండి బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం వరకు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ తిరుగుబాటు ప్రదర్శన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ప్రదర్శనకు జిల్లపల్లి అంజి, మోడీ రాందేవ్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కృష్ణయ్య, బీసీలకు జరిగిన అన్యాయం పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఆధారాలతో సహా వాస్తవాలను బయటపెడతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేసి 42% రిజర్వేషన్ల ఖరారు కోసం చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.

బీసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని 42 శాతం రిజర్వేషన్లతోనే రాబోయే ఎన్నికలను నిర్వహించాలని కృష్ణయ్య స్పష్టం చేశారు.







