chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: పంట పొలాల్లో నీరు బయటకు పంపాలి

GUNTUR COLLECTOR MEETING ON FLOOD

పంట పొలాల్లో నీరు బయటకు పంపాలని జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. తుఫాను ప్రభావంతో వివిధ పంట పొలాల్లో పరిస్థితిని జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులు, నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. పంటలను ఎట్టి పరిస్థితుల్లోను కాపాడాలని ముఖ్యమంత్రి ఆదేశించి ఉన్నారని చెప్పారు. అందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటువంటి సమస్య భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం తగిన సూచనలు, సలహాలు అందించాలని కోరారు. జలవనరుల శాఖ వ్యవసాయ శాఖ సమన్వయంతో పనిచేసి పక్కాగా సమగ్ర ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకట రత్నం మాట్లాడుతూ పెదనందిపాడు వద్ద నల్లమడ వాగుకు పరుచూరు, ఆలేరు వాగుల నుండి నీరు చేరి 42,335 క్యూసెక్కుల నీరు ప్రవహించిందని, తద్వారా పంట పొలాల్లో బాగా నీరు చేరిందన్నారు. కొమ్మూరు కాలువ గండి పడిందన్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా క్రింద 3746 హెక్టార్లలో పంట నీట మునిగిందన్నారు. ఇందులో కాకుమాను మండలంలో 1326 హెక్టార్లు, పెదకాకాని మండలంలో 460 హెక్టార్లు, పెదనందిపాడులో 363 హెక్టార్లు, మంగళగిరిలో 265 హెక్టార్లు, తాడేపల్లిలో 92 హెక్టార్లు, ప్రత్తిపాడులో 70 హెక్టార్లు, చేబ్రోలులో 7 హెక్టార్లు ఉన్నాయన్నారు. నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులు తమ ప్రాంతంలో పంటలు, కాలువల పరిస్థితిని వివరించారు. కాలువలకు చేపట్టాల్సిన పనుల వివరాలను తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker