
గుంటూరు, అక్టోబర్ 12: ఫైర్ సర్వీసెస్ విభాగం డైరెక్టర్ జనరల్ P.V. రమణ జోన్-III జిల్లాలకు చెందిన విభాగ సంబంధిత సమీక్ష సమావేశాన్ని గుంటూరు హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించారు. ఈ సమావేశం నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో జరిగింది.ఈ సమీక్షలో అడిషనల్ డైరెక్టర్ (సౌత్) శ్రీ R. గ్నాన సుందరం, రీజనల్ ఫైర్ ఆఫీసర్ గుంటూరు M.A.Q. జీలానీ, గుంటూరు, ప్రకాశం, SPSR నెల్లూరు, బాపట్ల మరియు పల్నాడు జిల్లాలకు చెందిన డిప్యూటీ డైరెక్టర్ రేంజ్ ఫైర్ ఆఫీసర్లు (DDRFO), అన్ని ADFOలు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రీజనల్ ఫైర్ ఆఫీసర్ మరియు DDRFOలు విభాగంలో నెలకొన్న సమస్యలపై మరియు జిల్లా పరిధిలో చేపట్టాల్సిన చర్యలపై ప్రెజెంటేషన్లు ఇచ్చారు. DG సర్ విభాగ సంబంధిత కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా సీరియస్ ఫైర్ కాల్స్, ఫైర్ ఫైటింగ్ వెహికల్స్, రెస్క్యూ ఎక్విప్‌మెంట్, వాటర్ రెస్క్యూ ఏర్పాట్లు, స్విమ్మింగ్ ట్రైనింగ్ కార్యక్రమాలపై సమీక్ష జరిగింది.
హజార్డస్ ప్రెమిసెస్ విషయంలో, నేషనల్ బిల్డింగ్ కోడ్ (NBC) నిబంధనల ప్రకారం ఫైర్ సేఫ్టీ నార్మ్స్ అమలుకు సంబంధించి అన్ని రకాల ప్రాంగణాలకు నోటీసులు జారీ చేయాలనే సూచనలు జారీ చేశారు. నోటీసుల జారీ విధానం, సంబంధిత యాజమాన్యాలకు కమ్యూనికేట్ చేయడం వంటి దశలపై మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి.ఫైర్ ప్రివెన్షన్ చర్యల కింద, NOCల జారీకి అధికార పరిమితులు విభిన్న స్థాయిల అధికారులకు పంపిణీ చేశారు. దీనివల్ల NOCల ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగవంతంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. మేనేజ్‌మెంట్లపై ఎటువంటి భయభ్రాంతులు లేకుండా ప్రక్రియ కొనసాగించాలంటూ ఆదేశాలు ఇచ్చారు.
delhi-police ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పరంగా, ప్రొవిజనల్ NOCను 3 రోజుల్లో, ఆక్యుపెన్సీ మరియు రెన్యూవల్ NOCలను 21 రోజుల్లో జారీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించబడ్డాయి. అలాగే, థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్స్ ఆధారంగా రెన్యూవల్ NOCలను ఐదు సంవత్సరాల కాలానికి మంజూరు చేయాలన్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.ట్రైనింగ్ కార్యక్రమాలు కోణంలో, అన్ని.డిస్ట్రిక్ట్/అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్లు మరియు స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు తమ పరిధిలో మూడు రోజుల ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ కోర్సులు నిర్వహించాలని ఆదేశించారు. స్టేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు ఫీజు చెల్లించి చలాన్లు సమర్పించాలని సూచించారు.15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల కింద చేపడుతున్న ఫైర్ స్టేషన్ బిల్డింగ్ వర్క్స్‌పై అన్ని జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయాలని, ప్రగతిని సమయానికి అప్‌డేట్ చేస్తూ బడ్జెట్ క్లియరెన్స్ కోసం చీఫ్ ఆఫీసుకు నివేదికలు సమర్పించాలని DG స్పష్టం చేశారు.







