
హైదరాబాద్:-తల్లిదండ్రులు మార్కులు, ర్యాంకులు అంటూ పిల్లలపై అనవసరమైన ఒత్తిడి చేయకుండా, వారిలో దాగి ఉన్న ఆసక్తి, నైపుణ్యాలను గుర్తించాలని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ సూచించారు. పిల్లల భవిష్యత్తుకు మార్కులే ప్రామాణికం కాదని, వారి ప్రతిభను మెరుగుపరుచుకునేలా తల్లిదండ్రులు సహకరించాలని ఆయన అన్నారు.

ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో డా. సురేంద్ర బాబు రచించిన “పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు” అనే పుస్తకాన్ని జయప్రకాష్ నారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లల్లో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడంలో ఈ పుస్తకం ఎంతో దోహదపడుతుందనిHyderabad news గ్లోబల్ టీపీఓ అండ్ హెచ్ఆర్ సమ్మిట్ – 2025 పేర్కొన్నారు.

బట్టీ చదువులకు స్వస్తి పలికినప్పుడే విద్యార్థులు తాము ఇష్టపడే రంగాల్లో రాణించగలుగుతారని చెప్పారు. ఈ పుస్తకం పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా తప్పనిసరిగా చదవాలని, అప్పుడే పిల్లల భవిష్యత్తుపై ఉన్న అపోహలు తొలగిపోతాయని జయప్రకాష్ నారాయణ స్పష్టం చేశారు.










