chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Thadepalli news:జోగి రమేష్ అక్రమంగా అరెస్ట్ తీవ్రంగా ఖండించి మంగళగిరి వైసిపి ఇన్చార్జ్-దొంతి రెడ్డి వేమారెడ్డి

గుంటూరు :తాడేపల్లి:02-11-25:-మాజీ మంత్రి జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ దొంతి రెడ్డి వేమారెడ్డి, తాడేపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.“ఏపీలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. నకిలీ మద్యం కేసులో ముందుగానే ప్లాన్ ప్రకారం జోగి రమేష్‌ను ఇరికించారు. నిజంగా న్యాయం ఉంటే ఆ కేసును సీబీఐకి ఎందుకు అప్పగించడంలేదు?” అని వేమారెడ్డి ప్రశ్నించారు.

జోగి రమేష్ దుర్గమ్మ సాక్షిగా తాను ఎటువంటి తప్పూ చేయలేదని ప్రమాణం చేసిన విషయం గుర్తుచేసి, “మీరు ఎందుకు సత్యప్రమాణం చేయడం లేదు?” అంటూ వేమారెడ్డి సవాల్‌ విసిరారు.కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనలో పలువురి మృతి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆ సంఘటనపై ప్రజల దృష్టి మళ్లించేందుకు జోగి రమేష్‌ను అరెస్ట్ చేశారంటూ వేమారెడ్డి ఆరోపించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker