
హైదరాబాద్:
కాళేశ్వరం అవినీతి అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి తరచూ కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తూనే హరీష్‌రావుపై మాత్రం మౌనం వహించడం గమనార్హమని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు.ఆమె మాట్లాడుతూ –
“నా నాన్నపై సీబీఐ కేసు నమోదయిందంటే దానికి కారణం హరీష్‌రావే. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి ఆయన ఎక్కడా కనిపించలేదు. కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసినప్పుడు అడ్డుకున్నది హరీష్‌రావే. పార్టీకి చెడ్డపేరు వస్తుంటే నేరుగా వెళ్లి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డిని కలిసింది కూడా ఆయనే కాదా?” అని కవిత ప్రశ్నించారు.కాళేశ్వరం అంశంలో కేసీఆర్‌పైనే టార్గెట్ చేస్తూ, హరీష్‌రావుపై ఎందుకు రేవంత్ నోరు మూసుకున్నారని ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు.







