
హైదరాబాద్:21-10-25:-తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 12 ఏళ్లు గడిచినా వైన్ షాప్ టెండర్లలో ఇంకా ఆంధ్ర వ్యాపారుల ఆధిపత్యం కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.హైదరాబాద్ నాంపల్లి అప్కరి భవన్‌లోని ఎక్సైజ్ శాఖ కమిషనర్‌ను దామోదర్ గౌడ్ కలిసి సమస్యను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –ఎక్సైజ్ శాఖ అధికారులు ఆంధ్ర వ్యాపారులకు సహకరిస్తూ తెలంగాణ వ్యాపారుల ప్రయోజనాలను పక్కనబెడుతున్నారని ఆరోపించారు. “ఆంధ్ర సిండికేట్ వ్యాపారులు అక్రమంగా రాష్ట్రంలో చొరబడి వ్యాపారాలు చేస్తూ స్థానిక వ్యాపారుల జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నారు,” అని దామోదర్ గౌడ్ మండిపడ్డారు.
అంతేకాకుండా, “ఆంధ్ర వ్యాపారులకోసమే టెండర్ల గడువు తేదీని అధికారులు ఉద్దేశపూర్వకంగా పెంచినట్టుంది” అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాపారులు ఆంధ్రప్రదేశ్‌లో టెండర్లు వేసే ప్రయత్నం చేస్తే అక్కడ దాడులు జరుగుతాయని, అటువంటి వ్యక్తులకు ఇక్కడ టెండర్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.ఈ వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తక్షణమే జోక్యం చేసుకుని, ఆంధ్ర వ్యాపారులకు కేటాయించిన టెండర్లను రద్దు చేయాలని దామోదర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.







