- Change the Narrative – నిరాశ చెండాడండి, జీవనంపై విశ్వాసం పెంపొందించండి”
- ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఆధ్వర్యంలో
హైదరాబాద్, సెప్టెంబర్ 10:ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు యర్రగడ్డలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్. అనిత అధ్యక్షత వహించారు.
సదస్సును ఉద్దేశించి మాట్లాడిన డాక్టర్ ఆర్. అనిత మాట్లాడుతూ — ఆత్మహత్యలు కేవలం వ్యక్తిగత సమస్యలు కాదని, ఇవి ఒక పెద్ద ప్రజా ఆరోగ్య సమస్యగా మారాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 8 లక్షల మంది ప్రాణాలు ఆత్మహత్యల వలన కోల్పోతున్నారని, ప్రతి ఆత్మహత్య వెనుక కనీసం 20 ప్రయత్నాలు జరుగుతాయని వివరించారు.
ఆమె ప్రత్యేకంగా పేర్కొంటూ — “ఈ ఏడాది థీమ్ ‘Change the Narrative – నిరాశ చెండాడండి, జీవనంపై విశ్వాసం పెంపొందించండి.’ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. చిన్న విషయాలకే ప్రాణం తీసుకోవడం తప్పు. కష్టకాలంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, మానసిక నిపుణులు మనకు తోడుగా ఉంటారు” అని అన్నారు.ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది ప్రాణాలు ఆత్మహత్యల వలన కోల్పోతున్నారని, ప్రతి ఆత్మహత్య వెనుక కనీసం 20 ప్రయత్నాలు జరుగుతాయని వారు చెప్పారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు, వృద్ధులు ఇలా అన్ని వర్గాలవారిలో ఆత్మహత్య సమస్య ఎక్కువవుతోందని హెచ్చరించారు.
ఆత్మహత్యలకు దారితీసే ప్రధాన కారణాలు: నిరాశ, డిప్రెషన్, ఆందోళన, విద్యా ఒత్తిడి, పరీక్షల్లో విఫలం కావడం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ విభేదాలు, సంబంధ సమస్యలు, మత్తు పదార్థాల వాడకం, ఒంటరితనం, సమాజంలో అంగీకారం లేకపోవడం. వీటిని సకాలంలో గుర్తించి పరిష్కరించకపోతే ప్రమాదం తప్పదని నిపుణులు సూచించారు.
నివారణ మార్గాలపై వైద్యులు ఇచ్చిన సూచనలు: సమస్యలను దాచిపెట్టకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలి. మత్తు పదార్థాల వాడకం మానుకోవాలి. ఆశ కలిగించే వాతావరణం కుటుంబంలో, విద్యాసంస్థల్లో ఉండాలి. ప్రతిరోజూ వ్యాయామం, యోగా, ధ్యానం వంటి అలవాట్లను పెంపొందించుకోవాలి. చిన్న విషయాలకే ప్రాణం తీసుకోవడం తప్పని గుర్తించాలి.
ఆత్మహత్యపై ఉన్న అపోహలు – వాస్తవాలు:
- అపోహ: ఆత్మహత్య గురించి మాట్లాడేవారు అది చేయరని అనుకోవడం.
వాస్తవం: నిజానికి అలాంటి వారు సహాయం కోరుతున్నారు. - అపోహ: ఎవరైనా ఆత్మహత్య చేయాలని నిర్ణయించుకున్నవారికి సహాయం చేయలేమని భావించడం.
వాస్తవం: సమయానికి సహాయం చేస్తే వారిని తప్పక కాపాడవచ్చు. - అపోహ: ఆత్మహత్య స్వార్థపూరిత చర్య అని అనుకోవడం.
వాస్తవం: చాలామంది తాము కుటుంబానికి భారమని భావించి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు.
సమాజానికి వైద్యుల సందేశం:
ఆత్మహత్య ఒక పెద్ద ట్రాజెడీ అయినప్పటికీ, ఆత్మహత్యా ఆలోచనలు కలిగిన వారిని “అటెన్షన్ సీకర్స్” అంటూ తక్కువగా చూడకూడదు. అలాంటి వారిని అర్థం చేసుకోవాలి, వారితో మాట్లాడాలి, అవసరమైతే నిపుణుల సహాయం అందించాలి. ఇది సమాజపు బాధ్యత అని వారు గుర్తు చేశారు.
చివరగా నిపుణులు పిలుపునిస్తూ అన్నారు:
“జీవితం విలువైనది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మీరు ఒంటరిగా లేరు. సహాయం ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. మానసిక సమస్యలు ఎదురైనప్పుడు లేదా ఆత్మహత్యా ఆలోచనలు కలిగినప్పుడు వెంటనే జాతీయ మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్ ☎ 14416 (Tele MANAS) కు కాల్ చేయం