GUNTUR CITY NEWS: డ్రైన్ ల పూడిక తీత పనులు చేపట్టాలి: కమీషనర్

Karthik

గుంటూరులో డ్రైన్ల పూడికతీత పనులు మంగళవారం నుండే ప్రారంభించాలని, వర్షాకాలనికి ముందే నగరంలోని ప్రధాన డ్రైన్లలో పూడికతీత పూర్తి కావాలని, ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తైనందున స్థానికంగా 5 మందితో పర్యవేక్షణ కమిటి పూడికతీత పనులను పరిశీలిన జరగాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో మాన్ సూన్ ప్లాన్ అమలుపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాలు కురవక ముందే నగరంలోని మేజర్, మీడియం డ్రైన్లలో పూడికతీత పూర్తయ్యేలా ఏఈల వారీగా యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలన్నారు. పూడికను డ్రైన్ పూర్తి లోతు నుండి తీయాలని, తీసిన పూడికను 24 గంటలలోగా తొలగించాలని స్పష్టం చేశారు. జలధారలో భాగంగా నగరంలోని ప్రతి చెరువులో పూడిక తీయాలని, అందుకు అవసరమైన ప్రణాళిక, నూతన జేసిబీను కొనుగోలు చేయాలని, అప్పటివరకు జేసిబీలను అద్దెకు తీసుకోవాలన్నారు. సాదారణ నిధులు, 15 ఫైనాన్స్ నిధులతో వార్డ్ ల వారీగా నివేదిక ఇవ్వాలని ఎస్ఈని ఆదేశించారు. వర్షాలు రాక ముందే ప్రతిపాదిత నూతన డ్రైన్ నిర్మాణాలు పూర్తీ చేయాలని, చలివేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న పార్క్ ల్లో బ్యూటిఫికేషన్ చేస్తూనే, నూతన పార్క్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఈఈలను ఆదేశించారు. నగరంలోని అన్న క్యాంటీన్లలో నీడ కోసం షెడ్స్ ఏర్పాటు, మరమత్తులు, నగరంలోని నగరపాలక సంస్థ టాయ్ లెట్స్ మరమత్తులు వేగంగా చేయాలన్నారు. గతేడాది వర్షాలకు ముంపుకి గురైన ప్రాంతాల్లో ఈ ఏడాది ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. డొంక రోడ్ 3 వంతెనల వద్ద రైల్వే శాఖ బొంగరాలబీడు వైపు ప్రతిపాదించిన ప్రధాన అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించుటకు రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడతామన్నారు.కార్యక్రమంలో ఎస్ఈ వెంకటేశ్వరరావు, ఈఈలు సుందర్రామిరెడ్డి, వేణుగోపాల్, విష్ణు, కళ్యాణరావు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review