
Hyderabad:14-11-25:-భాగ్యనగరంలో క్రిస్మస్ సంబరాలు ముందే మొదలయ్యాయి. హైదరాబాద్ లకిడికపుల్‌లోని అశోక్ హోటల్ ఆవరణలో ఈసారి కూడా కేక్ మిక్సింగ్ ఫెస్టివల్ సందడి చెలరేగింది. వివిధ రకాల డ్రైఫ్రూట్స్, ప్రత్యేకమైన మసాలాలు… లవంగాలు, యాలకుల పొడి వరకు… దేశీయ మద్యంతో పాటు ఖరీదైన వైన్‌ను హోటల్ సిబ్బందితో కలిసి స్వయంగా హోటల్ ఎండి డాక్టర్ తేజస్విని రెడ్డి కేక్ మిక్సింగ్‌లో పాల్గొన్నారు.

సిబ్బంది అంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా పోటీ పడి డ్రైఫ్రూట్స్‌ను కలపడం, మసాలాలు జోడించడం ఇలా మొత్తం ప్రక్రియను ఆనందంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా హోటల్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ—

“ఈ మిక్సింగ్ మిశ్రమాన్ని డిసెంబర్ రెండో వారం వరకు నానబెట్టుకుంటాం. నెలరోజులపాటు వేడిగా ఉన్న ప్రదేశంలో ఉంచి ప్రత్యేక కేక్‌ల తయారీని ప్రారంభిస్తాం. క్రిస్మస్, న్యూ ఇయర్ సంబరాలకు సిద్ధం చేస్తాం,” అని తెలిపారు.కేక్ మిక్సింగ్ కార్యక్రమం సిబ్బంది–యాజమాన్య బంధాన్ని మరింత బలపరుస్తుందని హోటల్ ఎండి డాక్టర్ తేజస్విని రెడ్డి పేర్కొన్నారు. గత కొన్ని ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నట్లు కూడా వారు వివరించారు.







