గుజ్జనగుండ్ల శానిటరీ కార్యాలయం వద్ద కార్మికులను ఉద్దేశించి సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ అనారోగ్య కారణాలవల్ల చనిపోయిన కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని అన్నారు. గత అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న పద్ధతిని నూతనంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిలుపుదల చేయడం దుర్మార్గమని అన్నారు. అలాగే గుంటూరు నగరపాలక సంస్థలో ఆప్కాస్ నందు పనిచేస్తూ మరణించిన కార్మికుల వారసులకు ఉద్యోగం అవకాశం కల్పించాలని అనేక పోరాటాల ఫలితంగా ఇప్పటికీ బ్యాంకుల ద్వారా జీతాలు సాధించుకోగలిగాం, గతంలో కాంట్రాక్టర్లు మారిన వర్కర్లు మారకుండా అదే డివిజన్లో పనిచేసే విధంగా కొనసాగించగలిగాం. 15 క్యాజువల్ లీవులు తెచ్చుకోగలిగాం. పదవి విరమణ వయసు 60 నుండి 62 కు పెంచాలని గతంలో లాగా 62 సంవత్సరాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ కార్మికులకు బకాయి ఉన్న బట్టలు కుట్టు కూలీ నూనెలు సబ్బులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
GUNTUR CITY NEWS: చనిపోయిన వారి వారసులకు ఉద్యోగం కల్పించాలి: సీపీఐ

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
34°C
Vijayawada
broken clouds
34° _ 34°
36%
6 km/h
Sun
34 °C
Mon
47 °C
Tue
45 °C


