Vijayawada Local news :అమరావతి ఛాంపియన్షిప్ కప్–2026 ఏర్పాట్లపై సమీక్షయువత క్రీడల్లో రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలుశాప్ చైర్మన్ రవి నాయుడు

Sharat
2 Views

విజయవాడ, జూన్ 17 :– నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా నిర్వహించనున్న అమరావతి ఛాంపియన్షిప్ కప్–2026 పోటీల ఏర్పాట్లపై శాప్ చైర్మన్ రవి నాయుడు బుధవారం విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించాలనే లక్ష్యంతో అమరావతి ఛాంపియన్షిప్ కప్–2026ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అండర్-17, అండర్-23 విభాగాల్లో మొత్తం 12 క్రీడాంశాల్లో నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

పోటీల షెడ్యూల్‌ను వివరిస్తూ, నియోజకవర్గ స్థాయి ఎంపిక పోటీలు జూలై 10 నుంచి 25 వరకు, జిల్లా స్థాయి పోటీలు జూలై 26 నుంచి ఆగస్టు 10 వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు ఆగస్టు 20 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

పోటీల నిర్వహణలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్న ఆయన, నియోజకవర్గ స్థాయి పోటీల్లో స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి పోటీల్లో స్థానిక ఎమ్మెల్యేలతో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రులను భాగస్వాములుగా చేర్చాలని అధికారులను ఆదేశించారు.

పోటీల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని యువత పెద్ద సంఖ్యలో ఈ క్రీడా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

సమావేశంలో శాప్ ఏవో రమావత్ వెంకటరమణ నాయక్, క్రీడాశాఖ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review