Chirala News రామాపురం బీచ్‌లో ఆలివ్ రిడ్లి తాబేలు పిల్లలకు సముద్ర ప్రవేశం – కలెక్టర్ చేతుల మీదుగా విడుదల

Jaya Raju
509 Views

రామాపురం బీచ్, చీరాల మండలం, బాపట్ల జిల్లా:

శుక్రవారం ఉదయం రామాపురం బీచ్ వద్ద ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మరియు ట్రి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సముద్ర తాబేళ్ల సంరక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆలివ్ రిడ్లి జాతికి చెందిన సముద్ర తాబేలు పిల్లలను సముద్రంలోకి విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐఏఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి వదిలారు. ఆయన మాట్లాడుతూ సముద్ర జీవ వైవిధ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, డీఎఫ్‌ఓ రవి శంకర్, చీరాల మరియు వేటపాలెం మండలాల తహశీల్దార్లు, అటవీ శాఖ సిబ్బంది, ట్రి ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review