ఏపీలో పెట్రోల్ టెన్షన్.. సాయంత్రానికి అంతా సెట్? ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్!

Bhuvana

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు. పెట్రో ఉత్పత్తుల సరఫరాలో అంతరాయం కలగడంపై ఉన్నతాధికారులతో అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం, కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ప్రజల ఇబ్బందులను ఆసరాగా చేసుకుని ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.”

“రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద నెలకొన్న పరిస్థితులపై ఆరా తీసిన ముఖ్యమంత్రి, సమస్య పరిష్కారానికి ఆయిల్ కంపెనీలు నిరంతరం పని చేయాలని స్పష్టం చేశారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి క్షేత్రస్థాయి నివేదికను తనకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్న వార్తలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించాలని సూచించారు.”

“చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు, సరఫరాను వేగవంతం చేశారు. సాయంత్రం కల్లా రాష్ట్రంలోని మెజార్టీ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ లభ్యత సాధారణ స్థితికి వస్తుందని ముఖ్యమంత్రికి వివరించారు. చుక్క పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర క్యూ కడుతున్న వాహనదారులకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం పౌరసరఫరాల శాఖను కోరారు. కృత్రిమ కొరత పేరుతో రేట్లు పెంచినా, స్టాక్ ఉన్నా లేదని చెప్పినా లైసెన్సులు రద్దు చేసేందుకు కూడా వెనకాడబోమని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ప్రజలు ఆందోళన చెందవద్దని, త్వరలోనే అన్ని బంకుల్లో ఇంధనం అందుబాటులోకి వస్తుందని అధికారులు భరోసా ఇస్తున్నారు.”

Author
Total Views: 0
Share This Article
Leave a review