హైదరాబాద్, మే: నగరంలోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన సోమాజిగూడ, రాజ్ భవన్ రోడ్లో ‘ఇవానా జువెల్స్’ (Ivana Jewels) నూతన షోరూమ్ వైభవంగా ప్రారంభమైంది. విక్కీ ఫ్లో (FICCI FLO) చైర్పర్సన్ శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, నిర్వహకులతో కలిసి ఈ నూతన షోరూమ్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఆకట్టుకుంటున్న కలెక్షన్స్
ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. షోరూమ్‌లోని బంగారం, వజ్రాభరణాల కలెక్షన్స్ అత్యద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ముఖ్యంగా ల్యాబ్-గ్రోన్ డైమండ్ (Lab-grown Diamond) జువెలరీకి ప్రస్తుతం మార్కెట్లో విశేషమైన డిమాండ్ ఉందని, పర్యావరణానికి మేలు చేసే ఇలాంటి అత్యాధునిక వజ్రాలను హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు.
విస్తరణ దిశగా అడుగులు
రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా తమ ఔట్లెట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు వెల్లడించారు.

సాంకేతికత.. వారసత్వ కళల కలయిక
ఇవానా జువెల్స్ వ్యవస్థాపక సభ్యుడు యోగిత్ జిందాల్ మాట్లాడుతూ..
“సూరత్‌కు చెందిన ప్రపంచ స్థాయి తయారీ నైపుణ్యమే మా పునాది. వారసత్వంగా వస్తున్న హస్తకళకు, ఆధునిక సాంకేతికతను జోడించి ఈ ఆభరణాలను తీర్చిదిద్దుతున్నాం. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా అత్యుత్తమ నాణ్యతతో వీటిని రూపొందించడమే మా లక్ష్యం.” అని పేర్కొన్నారు.
అత్యాధునిక డిజైన్లు, నమ్మకమైన నాణ్యతతో కొలువుదీరిన ఈ షోరూమ్, నగరంలోని ఆభరణాల ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోంది.



