Hyderabad City News :12 ఏళ్లుగా నిర్విరామంగా గణపతి పూజలు-అన్నదానంలో 6 వేల మందికి పైగా భక్తుల పాల్గొనడం

Sharat
1 View

హైదరాబాద్: హైదరాబాద్ లారీ సర్వీస్ అసోసియేషన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 12 ఏళ్లుగా నిర్విరామంగా గణపతి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ లారీ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పోకూరి శ్రీనివాస్ బాబు తెలిపారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

హైదరాబాద్ లారీ సర్వీస్ అసోసియేషన్ సెక్రటరీ చక్రవర్తుల గోపి గతంలో గణపతి పూజా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని శ్రీనివాస్ బాబు తెలిపారు. ఏటా ఉత్సవాలు మరింత విస్తృతంగా నిర్వహిస్తూ వస్తున్నామని, తొలినాళ్లలో అన్నదాన కార్యక్రమానికి సుమారు 2 వేల మంది భక్తులు హాజరయ్యేవారని, ప్రస్తుతం 6 వేల మందికి పైగా భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని తెలిపారు.

ప్రతిరోజూ గణపతి పూజలతో పాటు ప్రత్యేక యజ్ఞ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గత ఏడాది గణపతి లడ్డూ రూ.1.25 లక్షల ధర పలికిందని, ఈ ఏడాది కూడా అసోసియేషన్‌కు చెందిన 107 మంది సభ్యులు వేలంపాటలో పాల్గొని లడ్డూను దక్కించుకోనున్నట్లు తెలిపారు.Hyderabad City news

అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు.

గణపతి నిమజ్జనం రోజున లడ్డూ వేలంపాట నిర్వహించి, అనంతరం గణపతి నిమజ్జన యాత్రను ప్రారంభిస్తామని శ్రీనివాస్ బాబు తెలిపారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు.

Author
Share This Article
Leave a review