Hyderabad City News :సెలబ్రిటీ దాండియా నైట్స్-10వ సీజన్ ప్రారంభానికి సిద్ధం- ఫ్లిప్‌సైడ్ అడ్వెంచర్ పార్క్‌లో 12 రోజుల పాటు వేడుకలు

S Sarath
1 View

హైదరాబాద్:– నగరంలో నవరాత్రి ఉత్సవాల కోలాహలం మొదలైంది. భాగ్యనగరవాసులకు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని అందించేందుకు ‘సెలబ్రిటీ దాండియా నైట్స్’ 10వ సీజన్ ఘనంగా ప్రారంభం కానుంది. ‘హైదరాబాద్ మోడల్స్’, ‘రాఘవి మీడియా’ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ వేడుకలు అక్టోబర్ 9వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దాదాపు 12 రోజుల పాటు అలరించనున్నాయి.

నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ప్రసిద్ధ ‘ఫ్లిప్‌సైడ్ అడ్వెంచర్ పార్క్’ వేదికగా ఈ నవరాత్రి సంబరాలు జరగనున్నాయి. ఈ 12 రోజుల ఉత్సవాల్లో సంప్రదాయ గర్బా, దాండియా నృత్యాలతో పాటు లైవ్ మ్యూజిక్ బ్యాండ్స్, ఉర్రూతలూగించే ఢోల్ తడ్కా, సినీ-బుల్లితెర సెలబ్రిటీల ప్రత్యేక సందడి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని నిర్వాహకులు తెలిపారు.Hyderabad City News

ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక పోస్టర్‌ను నిర్వాహకులు వంశీ పల్లె, మధుబాబులతో పాటు సినీ నటి సాయి కీర్తన స్వర్గం, ప్రముఖ యాంకర్ వైష్ణవి తదితరులు ఘనంగా ఆవిష్కరించారు. భాగ్యనగర దాండియా ప్రేమికులు ఈ వేడుకల్లో విశేషంగా పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

Author
Share This Article
Leave a review