GUNTUR DISTRICT NEWS: ఆసుపత్రులు, కార్యాలయాల్లో ఫైర్ ఆడిట్ నిర్వహించాలి

Karthik

ఆసుపత్రులు, కార్యాలయాల్లో ఫైర్ ఆడిట్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆదేశించారు. మంగళ, బుధవారాలలో జరిగిన అగ్ని ప్రమాదాలు దృష్ట్యా బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైర్ ఆడిట్ నిర్వహించాలని అన్నారు. ఫైర్ ఆడిట్ తో పాటు ఆసుపత్రిలో సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడ అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రతి నెల ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించారు. ఫైవ్ ఆడిట్ లో కనుగొన్న లోపాలను సంబంధిత ఆసుపత్రిలు, కార్యాలయాలు తక్షణం పునరుద్ధరణ చేయాలని పేర్కొన్నారు. అగ్నిమాపక పరికరాల ఎక్స్పైరీ డేట్ ను కూడా విధిగా పరిశీలించాలని ఆయన ఆదేశించారు. వేసవి తీవ్రత ఉందని ఈ సమయంలో విద్యుత్తు ఉపకరణాలు వినియోగం అధికంగా ఉంటుందని విద్యుత్ లోడుకు తగిన విధంగా లేనట్లయితే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుందని పేర్కొంటూ అటువంటి లోపాలు కనుగొనుటకు విద్యుత్ ఆడిట్ ను నిర్వహించాలని ఆదేశించారు. మునిసిపల్, పంచాయతీ పరిధిలలో చెత్త సేకరణ పక్కాగా జరగాలని ఆదేశించారు. చెత్త అనేక ప్రాంతాల్లో కాల్చడం జరుగుతుందని అటువంటి పద్ధతులను అవలంబించే రాదని ఆదేశించారు. మునిసిపల్ పరిధిలో చెత్త శుభ్రత కార్యక్రమం రహదారుల కు మాత్రమే పరిమితం కాకుండా పట్టణం మొత్తం పరిశుభ్రంగా ఉండుటకు చర్యలు చేపట్టాలని సూచించారు. *మీడియా వార్తతో ప్రయోజనం* గత నెలలో అగ్ని ప్రమాదాలపై మీడియాలో ప్రచురితమైన ఒక వార్త బాగా ఉపయోగపడిందని జిల్లా కలెక్టర్ అన్నారు. వార్త సమాచారంతో వెంటనే అగ్నిమాపక అధికారికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఆ మేరకు జి జి హెచ్ లో మాకు డ్రిల్ నిర్వహణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఈ మార్క్ డ్రిల్ కార్యక్రమం మంగళవారం జరిగిన అగ్ని ప్రమాద నివారణకు ఎంతగానో తోడ్పడిందని అన్నారు. ప్రజల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.*జి.జి.హెచ్ ను తనిఖీ చేసిన కలెక్టర్*జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం తనిఖీ చేసి ప్రమాద సంఘటనపై ఆరా తీశారు. సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని, అగ్నిమాపక వ్యవస్థ పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారుఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్.ఎస్.వి.రమణ,  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి.రంగా రావు,జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, ఎం.టి.ఎం.సి కమిషనర్ అలీం భాషా, తెనాలి మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పల నాయుడు, ఎ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి కార్యనిర్వహక ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review