GUNTUR CITY NEWS: గుంటూరు ఎన్జీవో కాలనీలో యోగా దినోత్సవ వేడుకలు

Karthik

గుంటూరులో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ఎన్జీవో కాలనీ పార్కులో యోగాసనాలు కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జక్కిరెడ్డి సుబ్బాయమ్మ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవ ప్రాముఖ్యత గురించి సుబ్బాయమ్మ వివరించారు. శారీరక ఆరోగ్యం -ఆనందం మానసిక శాంతి. సంతోషం మనసు పై ఒత్తిడిని తగ్గిస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా పలువురు యోగా గురువులను ఘనంగా సత్కరించి అభినందించారు.

Author
Share This Article
Leave a review