దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేని అసమర్థ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ విమర్శించారు.జవహర్ లాల్ నెహ్రూ కు ఏమాత్రం మోడీ సరికాదని వ్యాఖ్యానించారు. ఈమేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ 120 ఏళ్లు పరిపాలన చేసినా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేరని చెప్పారు. లక్షల కోట్ల రూపాయల అప్పు చేయడమే మోడీ గొప్పతనం అని విమర్శించారు. అదేవిధంగా గత 12 సంవత్సరాలుగా బీజేపీ పరిపాలనలో దేశంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యన్నం సుధీర్ బాబు తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా ద్రవ్యోల్బణం పెరిగిందని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ తోపాటు 300 రెట్లు నిత్యావసర వస్తువుల ధరలు పెంచారని పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యాలు, రైతుల ఆత్మహత్యలు, పెద్ద ఎత్తున జరిగిన రైలు ప్రమాదాలు గురించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎల్. ఈశ్వరరావు, డాక్టర్ జాన్ బాబు, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
GUNTUR DISTRICT NEWS: అసమర్థ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
33°C
Vijayawada
overcast clouds
33° _ 33°
54%
5 km/h
Sat
32 °C
Sun
38 °C
Mon
40 °C


