విజయవాడ, ఆగస్టు 2:- భారత జాతీయ పతాక రూపకర్త, తెలుగు జాతికి గర్వకారణమైన పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ విభాగం కార్యదర్శి బాజీబాబా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో భారతదేశంలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా భారతీయతను చాటిచెప్పే మహోన్నత చిహ్నం త్రివర్ణ పతాకమని పేర్కొన్నారు. పింగళి వెంకయ్య దేశభక్తి, త్యాగం, దూరదృష్టికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు.
త్రివర్ణ పతాకం దేశ సమైక్యతకు, జాతీయ సమగ్రతకు ప్రతీకగా ప్రతి భారతీయుడిలో దేశభక్తిని పెంపొందిస్తుందని తెలిపారు. పింగళి వెంకయ్య దేశానికి అందించిన సేవలను ప్రతి తరం స్మరించుకోవాలని, ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని బాజీబాబా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్యకు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు



