ఏలూరు జిల్లా;- జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభువుగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి దేవస్థానానికి భక్తులు ఉదారంగా విరాళం అందజేశారు. దేవరపల్లి మండలం లక్షిపురం గ్రామానికి చెందిన దోనెలి వెంకట అప్పారావు చౌదరి, ఉమా మహేశ్వరి దంపతులు ఆలయ అభివృద్ధి కోసం రూ.1,00,000 విరాళంగా సమర్పించారు.
ఆలయ సీనియర్ అసిస్టెంట్ ఎన్. శ్రీనివాసు సమక్షంలో ఈ విరాళాన్ని స్వామివారికి అందజేశారు. భక్తుల సేవాభావాన్ని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారి ఆర్.వి. చందన అభినందించారు. భక్తులు అందిస్తున్న విరాళాలు ఆలయ అభివృద్ధికి, సౌకర్యాల విస్తరణకు దోహదపడతాయని వారు పేర్కొన్నారు.



