పదవులు నిలుపుకోవటానికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ నిధులు రూ. 100 కోట్లు ప్రభుత్వానికి దారాదత్తం చేశారని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం గౌరవాధ్యక్షుడు పంతగాని రమేష్ ఆరోపించారు. జనవరి 29న ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కు 100 కోట్లు డిపాజిట్ చేస్తూ జనవరి 29న ప్రొసీడింగ్ జారీ చేశారన్నారు. మరో రూ. 6 కోట్ల నిధులను పీఎఫ్ అధికారులు సీజ్ చేశారన్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ జీతాలు సక్రమంగా చెల్లించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. 130 మంది పైగా అతిథి ఆధ్యాపకులకు జీతాలు చెల్లించకుండా దసరా సంక్రాంతికి పస్తులు ఉంచారని.. గత నెల జీతాలను కూడా నేటి వరకు చెల్లించలేదన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించకుండా కోట్లాది రూపాయలు వసూలు చేసినా.. కాసులు వసూలు చేసి కాపీలు కొట్టిస్తున్నా.. దళిత మహిళా అధికారులను వేధిస్తున్నా. మహిళా ప్రొఫెసర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించినా.. ప్రభుత్వం పట్టీ పట్టిమనట్లు వ్యవహరించటానికి 100 కోట్ల నిధుల మళ్లింపే కారణమన్నారు. కూటమి ప్రభుత్వానికి కలంకంగా మారిన కోఆర్డినేటర్లను.. అవినీతి ఆచార్యులను తాత్కాలిక పాలకులు నిధులను మళ్లిస్తూ కాపాడుతున్నారన్నారు. అధికారుల తీరును ఖండిస్తూ బుధవారం ఏఎన్యూ లో ఆందోళన చేపట్టారు.
GUNTUR DISTRICT NEWS: పదవులు నిలుపుకోవడం కోసం యూనివర్సిటీ నిధులు దారాదత్తం

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
30°C
Vijayawada
broken clouds
30° _ 30°
58%
4 km/h
Thu
29 °C
Fri
41 °C
Sat
38 °C


