బాయ్స్ కాలేజ్ హాస్టల్ ఏర్పాటు చేయాలని పీడీఎస్‌యూ డిమాండ్
CITY NEWS TELUGU | CHINTALAPUDI: విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ చింతలపూడి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. స్థానిక జూనియర్ కళాశాల నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం ధర్నా చేశారు.
ఈ సందర్భంగా పీడీఎస్‌యూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కాకినాని మాట్లాడుతూ, చింతలపూడి మండలంలో ప్రభుత్వ బాలుర కాలేజ్ హాస్టల్ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సుమారు రెండు వేల మంది విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి చింతలపూడికి వస్తున్నారని, హాస్టల్ సౌకర్యం లేక పలువురు బయట గదులు అద్దెకు తీసుకొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే ప్రభుత్వ బాయ్స్ కాలేజ్ హాస్టల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.Track Your Application Status
చింతలపూడిలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణతో పాటు ప్రభుత్వ నిబంధనలను అమలు చేయడంలో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని పీడీఎస్‌యూ నాయకులు ఆరోపించారు. విద్యార్థుల సమస్యలపై పలుమార్లు వినతిపత్రాలు అందించినప్పటికీ తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. స్థానిక ఎంఈఓ పనితీరుపై ఆరోపణలు చేస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.Eluru distric News :మూడు సంవత్సరాలుగా గల్లంతైన మహిళ, బాలికను గుర్తించిన చింతలపూడి పోలీసులు
అలాగే ‘తల్లికి వందనం’ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున అందించాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరారు.Reporter Dashboard
పీడీఎస్‌యూ చింతలపూడి మండల అధ్యక్షుడు చరణ్ మాట్లాడుతూ, కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు అధిక సమయం తరగతులు నిర్వహిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు.Eluru Distric News :పేద కుటుంబానికి అండగా నిలిచిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్-రమాదేవికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
పీడీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి రయాన్ మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని కోరారు. చింతలపూడిలో బాయ్స్ కాలేజ్ హాస్టల్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థలపై వచ్చిన ఫిర్యాదులను విచారించి నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. #ChintalapudiFireAccident #EluruDistrict #FireAccident #ShortCircuit #APNews #Emergency
విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని పీడీఎస్‌యూ నాయకులు హెచ్చరించారు.



