ELURU: డిసెంబర్ నాటికి 90 శాతం అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం – ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ

City News Telugu

రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ

CITY NEWS TELUGU | ఏలూరు: ఏలూరు నగరంలో రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, డిసెంబర్ నెలాఖరులోగా ప్రధాన రహదారులను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు పెండింగ్‌లో ఉన్న 90 శాతం అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ (చంటి) తెలిపారు.

15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా వచ్చిన రూ.35 కోట్లను రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి వినియోగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నగరంలో గుంతలతో దెబ్బతిన్న రహదారులను అభివృద్ధి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. మొత్తంగా ఏలూరు నగరంలో సుమారు రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.EluruDistrict

గాయత్రీ నగర్‌లో 15వ ఆర్థిక సంఘం 8వ విడతలో మంజూరైన రూ.3.60 కోట్ల నిధుల్లో భాగంగా రూ.19 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. నగరంలో ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఎంత మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నారనే వివరాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో కూటమి నాయకులతో కలిసి పనులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

ప్రజల నుంచి గ్రీవెన్స్‌ల ద్వారా వచ్చిన వినతులతో పాటు మేయర్, కార్పొరేటర్లు, స్థానిక నాయకులు ప్రతిపాదించిన పనులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఉడా ద్వారా రూ.21 కోట్లు, ఎన్‌క్యాప్ ద్వారా రూ.11 కోట్లు, 15వ ఆర్థిక సంఘం 9వ విడత ద్వారా రూ.4 కోట్లు వచ్చే అవకాశం ఉందని, ఈ నిధులతో డిసెంబర్ నాటికి 90 శాతం పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.Reporter Dashboard

అదేవిధంగా నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో ప్రజలు తాగునీటిని వృథా చేయకుండా జాగ్రత్తగా వినియోగించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసే వరకు ప్రతి ఒక్కరూ నీటి పొదుపునకు సహకరించాలని కోరారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే, నగరపాలక సంస్థ అధికారులు, మేయర్, కార్పొరేటర్లు, కూటమి నాయకుల సమన్వయంతో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు.sricitynetworks

గాయత్రీ నగర్‌లో నిర్మిస్తున్న రోడ్డు దీర్ఘకాలం మన్నేలా నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ తెలిపారు. sricitynetworks.com

Share This Article
Leave a review