Eluru Distric News :పారిజాతగిరి దేవస్థాన ఈఓగా ఎం. రాంబాబు అదనపు పూర్తి బాధ్యతలు స్వీకరణ

Sharat
1 View

జంగారెడ్డిగూడెం, ఆగస్టు 3:– ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఎం. రాంబాబుకు అదనపు పూర్తి (ఫుల్ చార్జ్) బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్, గొల్లపూడి (విజయవాడ) కార్యాలయం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మండూరు గ్రూపు దేవాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఎం. రాంబాబుకు బాధ్యతలు అప్పగించారు.

ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.వి. చందన అధికారికంగా బాధ్యతలను ఎం. రాంబాబుకు అప్పగించారు. అనంతరం నూతన ఇన్‌చార్జి కార్యనిర్వహణాధికారి ఎం. రాంబాబును ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, సభ్యులు అన్నప్రగడ వీర రాఘవరావు, కొప్పుల నాగసురేంద్ర, కన్నా కృష్ణ, ముప్పిడి భాను, ఒడిగళ్ళ కుమారి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అబ్బిన దత్తాత్రేయ, గొట్టుముక్కల భాస్కర్‌రాజు, వాసవి సాయి నగేష్, దండు ధనరాజు, కానూరు శ్రీనివాస్, యోలూరు పాణికుమార్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఆర్.వి. చందనను సైతం ఆలయ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమం ముగింపులో ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు వేదాశీర్వచనాలు అందజేసి నూతన బాధ్యతలు స్వీకరించిన ఎం. రాంబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

Author
Share This Article
Leave a review