స్మార్ట్ కిచెన్ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గుంటూరు డీఈవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం ఏఇఓ గారికి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు దండాలక్ష్మీనారాయణ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం లక్ష్యాలను నిర్వీర్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన స్మార్ట్ కిచెన్ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని కోరారు. స్మార్ట్ కిచెన్ వ్యవస్థ అమలు అయితే కార్మికులకు ఉపాధి కోల్పోవడంతో పాటు. డ్రాప్స్ సంఖ్య కూడా పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ప్రభుత్వ పాఠశాలలో చదివేది పేద విద్యార్థులేని, అటువంటి పేద విద్యార్థులకు విద్య దూరం చేయడం కోసమే ఈ స్మార్ట్ కిచెన్ వ్యవస్థను తెచ్చారని అన్నారు. మధ్యాహ్న భోజనం పథకం ప్రవేశ పెట్టేటప్పుడు పేద పిల్లలు ఆరోగ్యవంతంగా ఎదగాలన్న, బడి మానేసే పిల్లల సంఖ్య తగ్గాలన్న మధ్యాహ్న భోజనం అవసరమని, దానికి అనుగుణంగా భోజనం రుచికరంగా వేడిగా తయారు చేసి పెట్టడం వల్ల కావలసిన పోషకాలు విద్యార్థులకు లభిస్తాయని భావించి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెడితే. నేడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని రద్దుచేసి స్మార్ట్ కిచెన్ పేరుతో కొద్దిమందికి ఇవ్వడం వల్ల విద్యా వ్యవస్థ దెబ్బతింటుందని అన్నారు. మధ్యాహ్న భోజనం కార్మికులు గత నాలుగు నెలలుగా జీతాలు రాక ఇబ్బంది పడుతుంటే వారి గురించి పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం. స్మార్ట్ కిచెన్ పేరుతో ముందుగానే పెట్టుబడులు పెట్టి బిల్డింగులు కట్టించి ప్రైవేటు వాళ్లకి ఇవ్వడం ఏమిటి అని ప్రశ్నించారు. స్మార్ట్ కిచెన్స్ వ్యవస్థ వల్ల విద్యార్థులకు వేడి ఆహారం కానీ పౌష్టికాహారం కానీ అందుబాటులో ఉండదని అన్నారు. కాబట్టి తక్షణమే ఈ స్మార్ట్ కిచెన్ వ్యవస్థను రద్దు చేయాలని. పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల జీతాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే 27వ తేదీ సోమవారం విజయవాడలో జరిగే కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమానికి మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి ఎస్కే షమీ, కోశాధికారి దేవకుమారి, నాయకులు ముక్తేశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు.
GUNTUR DISTRICT NEWS: స్మార్ట్ కిచెన్ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
32°C
Vijayawada
broken clouds
32° _ 32°
66%
4 km/h
Tue
32 °C
Wed
34 °C
Thu
37 °C


