Tenali:-ప్రముఖ సీనియర్ వైద్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు డా. పాటిబండ్ల దక్షిణామూర్తి కుటుంబాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం పరామర్శించారు. దక్షిణామూర్తి నివాసానికి వెళ్లిన మంత్రి ఆయన కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ డా. పాటిబండ్ల దక్షిణామూర్తి మరణం వైద్య రంగానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం వైద్య వృత్తిలో కొనసాగుతూ ప్రజలకు విశేష సేవలందించారని గుర్తుచేశారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా పార్టీ అభివృద్ధికి, ప్రజా సేవకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.Guntur City News
దక్షిణామూర్తి కుటుంబానికి ఈ కష్ట సమయంలో మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.



