GUNTUR DISTRICT NEWS: చిన్నారుల అందమైన జీవనానికి రెండు పోలియో చుక్కలు: జాయింట్ కలెక్టర్

Karthik

జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసి పోలియో రహిత సమాజానికి అందరు కృషి చేయాలని సంయుక్త కలెక్టర్ అతుతోష్ శ్రీవాస్తవ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా సంయుక్త కలెక్టర్ అతుతోష్ శ్రీవాస్తవ నగరపాలక సంస్థ కమీషనర్ మయూర్ అశోక్ తో కలసి స్థానిక బృందవాన గార్డెన్స్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వద్ద చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 913 కేంద్రాల్లో 4,012 మంది వ్యాక్సినేటర్ల ద్వారా 1,44,678 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. తల్లి తండ్రులు 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు ఇప్పించాలని , చిన్నారుల అందమైన జీవనానికి రెండు చుక్కలు ఎంతో ముఖ్యమన్నారు. ఈ నెల 29 మరియు 30 తేదీలలో అంగన్ వాడీ కార్యకర్తలు , ఏ ఎన్ ఎం లు, ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి ఈ రోజు పోలియో చుక్కలు వేయించుకొనని చిన్నారులను గుర్తుంచి వారికి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. తల్లి తండ్రులు తమ పిల్లలను దగ్గరలోని పోలింగ్ వ్యాక్సినేషన్ కేంద్రాలకు తీసుకువెళ్ళి పోలియో చుక్కలు వేయించాలని కోరుతున్నానన్నారు. నగరపాలక సంస్థ కమీషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈ రోజు జరుపుకుంటున్నామని , ఈ కార్యక్రమంలో భాగంగా గుంటూరు నగరపాలక పరిధిలో 0 నుండి 5 సంవత్సరాల చిన్నారులకు 275 సెంటర్లలో సుమారు ఒక లక్ష డోసులు వేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. 0 నుండి 5 సం.ల పిల్లలకు వ్యాక్సినేషన్ వేయించడానికి దగ్గరలోని హెల్త్ సెంటర్లు , అంగన్ వాడీ కేంద్రాలు , ఆర్ టీ సీ బస్ స్టాండ్స్ , ముఖ్య కూడళ్ళలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు తీసుకువెళ్ళి రెండు చుక్కల పోలియో వ్యాక్సిన్ వేయించాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. జీయంసీ పరిధిలో మొబైల్ టీమ్స్ 29 వున్నాయని, వలస కుటుంబాలు , నిర్మాణ ప్రాంతాలు , సంచార జాతుల నివాస ప్రాంతాలల్లో పర్యటించి చిన్నారులకు వ్యాక్సిన్ అందించడం జరుగుతుందన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పోలియో రహిత గుంటూరు జిల్లాగా చేయాలని పిలుపునిస్తున్నానన్నారు.

Author
Share This Article
Leave a review