రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ముఠా కార్మికులకు నెల బిల్లులు సక్రమంగా చెల్లించని ఈ ప్రభుత్వాలపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ హమాలీ(ముఠా)వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎస్. వెంకటసుబ్బయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక గుంటూరు సివిల్ సప్లయీస్ గోడౌన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థకు కీలక భూమిక ఉన్న కార్మికుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి పై రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో వద్ద ధర్నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా సివిల్ సప్లయీస్ కార్పోరేషన్ లో పనిచేస్తున్న ముఠా కార్మికుల నూతన కూలీ రేట్ల అగ్రిమెంటును పూర్తి చేసి కూలిరేట్లను అమలు చేయాలని అలాగే డీలర్ తంబుతో సంబంధం లేకుండా నెల బిల్లులు సక్రమంగా చెల్లించాలని ప్రావిడెంట్ సమస్యల్ని పరిష్కరించి పెన్షన్ సౌకర్యం కల్పించాలని మరియు ఇతరదీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేయటానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు మాట్లాడుతూ కార్మిక వర్గ సమస్యలపై ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలను నిర్వహించడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉన్నారని యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి రావుల అంజిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు కోట్ల మరియదాసు నగర నాయకులు వినుకొండ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
GUNTUR DISTRICT: NEWS: సివిల్ సప్లయీస్ కార్మికుల బిల్లులు చెల్లించకపోతే సమ్మె తప్పదు

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
25°C
Vijayawada
overcast clouds
25° _ 25°
94%
2 km/h
Fri
32 °C
Sat
31 °C
Sun
30 °C


