కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్ – సర్) ప్రక్రియకు జూలై 14 వరకే గడువు ఉన్నందున, వేగంగా నిర్వహించేందుకు సహకరించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ నగర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని పాటిబండ్ల సీతారామయ్య స్కూల్లో ఏర్పాటు చేసిన స్పెషల్ క్యాంపెయిన్ డే ని పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ జి.సాంబశివరావుతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌లో ఎన్యూమరేషన్ ఫారాల అందజేత, డిజిటలైజేషన్ ప్రక్రియకు గడువు సమీపిస్తున్నందున ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను సులభంగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు ఓటర్లు, రాజకీయ పార్టీల బిఎల్‌ఏలు సహకరించాలని కోరారు. సర్ వేగవంతానికి ఓటర్లు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డ్ లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సర్ అనేది అత్యంత ప్రాధాన్యత కల్గిన అంశమని, బిఎల్ఓలు అంకిత భావంతో విధులు నిర్వహించకుంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.సర్ ప్రక్రియలో భాగంగా ఆదివారం నాటికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొత్తం 2,52,062 ఓటర్లకు గాను 2,41,128 ఫారాలను (95.66 శాతం) పంపిణీ చేసి, అందులో 30,673 ఫారాలను డిజిటలైజ్ చేశామని తెలిపారు. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 2,78,555 ఓటర్లకు గాను 2,72,050 ఫారాలను (97.66 శాతం) పంపిణీ పూర్తి చేసి, వాటిలో 28,064 ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేశామని వివరించారు.
GUNTUR DISTRICT NEWS: SIR ప్రక్రియ వేగవంతం – ప్రజలు సహకరించాలి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
24°C
Vijayawada
few clouds
24° _ 24°
90%
Sun
33 °C
Mon
34 °C
Tue
34 °C


