గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు మరియు చెడు నడత కలిగిన వారికి పోలీసు అధికారులు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి పూర్తిగా స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఇటీవల ఒక రౌడీ షీటర్‌పై పీడీ యాక్ట్ అమలు చేసి రాజమండ్రి జైలుకు పంపించగా, బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించిన మరో రౌడీ షీటర్‌కు మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (ఎంఆర్వో) 15 రోజుల జైలు శిక్ష విధించారు.రౌడీ షీటర్లు మరియు నేరప్రవృత్తి కలిగిన వ్యక్తులపై జిల్లా వ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగుతోందని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
GUNTUR DISTRICT NEWS: నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు గట్టి కౌన్సిలింగ్ చేస్తున్న గుంటూరు పోలీసులు

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
25°C
Vijayawada
clear sky
25° _ 25°
88%
1 km/h
Wed
33 °C
Thu
32 °C
Fri
29 °C


