గుంటూరు మిర్చి యార్డ్‌లో ఉన్న భోజనశాలను యార్డ్ చైర్మన్ కుర్రా అప్పారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భోజన నాణ్యత, పరిశుభ్రతపై ప్రతి రైతును స్వయంగా అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.రైతులు భోజనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకుని, వెంటనే సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. యార్డ్‌కు వచ్చే ప్రతి రైతుకు శుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందాలని స్పష్టం చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులు ఇబ్బంది పడకుండా భోజనశాలలో సరైన సదుపాయాలు ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా, భోజనశాల నిర్వహణలో మరింత మెరుగులు తీసుకురావాలని సూచించారు.ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగిస్తూ, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని కుర్రా అప్పారావు గారు తెలిపారు.



