GUNTUR DISTRICT NEWS: విత్తనాల బంతులతో సామాజిక వనాలు పెంచుదాం – దేశీయ అడవి విత్తనాలు సేకరించుదాం

Karthik

విత్తనాల బంతులతో సామాజిక వనాలు పెంచుదామని తిరుపతి సర్కిల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. గుంటూరు అటవీశాఖ కార్యాలయంలో తిరుపతి, గుంటూరు సర్కిల్స్ పరిధిలోని బాపట్ల, ప్రకాశం, గుంటూరు, రాయచోటి, అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి జిల్లాల డిఎఫ్ఒలు, సోషల్ ఫారెస్ట్రీ అధికారులతో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తో విత్తనాల బంతులు తయారు చేయడంపై అవగాహన కార్యక్రమం శనివారం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రభుత్వం 2.5 కోట్ల విత్తనాల బంతులు తయారు చేయడం జరుగుతుందని వివరించారు. దేశీయ అడవి విత్తనాలు సేకరించుదామని పిలుపునిచ్చారు. ఇందుకుగాను గ్రీన్ క్లైమేట్ టీం సూచించిన అన్ని ప్రాంతాలలోనూ సోమవారం ఉదయం నుంచి విత్తనాలు సేకరించడం అవసరమని గమనించాలని అన్నారు. ఔషధ గుణాలు కలిగిన విత్తనాలు సేకరించడం అవసరమని, అలాగే పక్షులు గూళ్ళు పెట్టే చెట్లు విత్తనాలు సేకరించుదామని అన్నారు. గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జె.వి రత్నం మాట్లాడుతూ అరవై నుండి 70 శాతం దేశీయ ఆవు పేడ, 30 నుంచి 40 శాతం మట్టి వినియోగించి, రెండు ఉండలు చేయడానికి అనువుగా కలపాలని వివరించారు. ఆ విత్తనాల సైజ్ ను బట్టి 75 నుండి 150 గ్రాముల మిశ్రమానికి ఏదో ఒక రకం విత్తనాలు మూడు వంతున పెట్టి విత్తనాల బంతులు తయారు చేయాలని సూచించారు.ఈ సమావేశంలో బాపట్ల డిఎఫ్ఒ రవిశంకర్, ప్రకాశం జిల్లా డిఎఫ్ఒ వినోద్ కుమార్, గుంటూరు జిల్లా డిఎఫ్ఒ హిమ శైలజ పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review